హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియా పోస్ట్ (India Post). ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 19 లోగా అప్లై చేయాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల (Post Office Jobs) భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులున్నాయి. మొత్తం 5 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 19 చివరి తేదీ. కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ తిరస్కరిస్తారు. అప్లికేషన్ ఫామ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్టులో పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు, దరఖాస్తు విధానం, విద్యార్హతల గురించి తెలుసుకోండి.

India Post Recruitment 2022: ఖాళీల వివరాలివే

మొత్తం ఖాళీలు5
ఎంవీ మెకానిక్ (స్కిల్డ్)2
ఎంవీ ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్)1
పెయింటర్ (స్కిల్డ్)1
టైర్‌మ్యాన్ (స్కిల్డ్)1

SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 5,008 ఉద్యోగాలు ... ఏం చదవాలంటే

India Post Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 19

విద్యార్హతలు- అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు.

ఎంపిక విధానం- కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్

వేతనం- ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006.

ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Jobs: పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

India Post Recruitment 2022: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- రిక్రూట్‌మెంట్స్ సెక్షన్‌లో Skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి.

Step 4- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 5- నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ పంపాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: India post, JOBS, Post office, Post office jobs

ఉత్తమ కథలు