ఇండియా పోస్ట్ ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో (IPPB) కూడా దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు అప్లికేషన్స్ స్వీకరించింది. ఇప్పుడు ఇండియా పోస్ట్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. తమిళనాడు పోస్టల్ సర్కిల్ మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చాయడానికి 2022 జూలై 20 చివరి తేదీ. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ అప్లై చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
మొత్తం ఖాళీలు- 24
దరఖాస్తు ప్రారంభం- 2022 జూన్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూలై 20
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
వేతనం- రూ.19,900
వయస్సు- 56 ఏళ్ల లోపు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai- 600006
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 3- నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
Step 4- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
Step 5- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
Step 6- చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.
ఇటీవల పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్ కోసం పోటీపడుతున్నారు. ఇండియా పోస్ట్ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్స్ కోసం https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2022, India post, Job notification, JOBS, Post office