హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

Post Office Jobs: పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

Post Office Jobs: పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. టెన్త్, ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs) ఉన్నాయి. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు. టెన్త్, ఇంటర్ పాస్ కావడంతో పాటు ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 నవంబర్ 22 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

India Post Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు188
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్71
పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్56
మల్టీ టాస్కింగ్ స్టాఫ్61

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 జాబ్స్ ... డిగ్రీ పాసైతే చాలు

India Post Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2022 అక్టోబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 నవంబర్ 22 సాయంత్రం 6 గంటలు

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2022 నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు

ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ లిస్ట్ ప్రకటన- 2022 డిసెంబర్ 6

India Post Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. 2022 అక్టోబర్ 25 నాటికి ఈ విద్యార్హతలు ఉండాలి.

వయస్సు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం 56,900 వేతనం లభిస్తుంది. అలవెన్సెస్ కూడా ఉంటాయి.

SBI Recruitment 2022: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ ... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

India Post Recruitment 2022: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు https://dopsportsrecruitment.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- మొదటి స్టేజ్‌లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 3- రెండో స్టేజ్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ట్రాన్స్‌జెండర్ వుమెన్, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Step 4- మూడో స్టేజ్‌లో ఫోటో, సంతకం, మార్క్స్ మెమో లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

First published:

Tags: India post, JOBS, Post office, Post office jobs

ఉత్తమ కథలు