Home /News /jobs /

INDIA POST RECRUITMENT 2022 INDIA POST INVITES APPLICATIONS FOR VARIOUS POSTS KNOW HOW TO APPLY SS

India Post Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలివే

Indian Post Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Indian Post Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

India Post Recruitment 2022 | పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఇండియా పోస్ట్ (India Post) పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. కొయంబత్తూర్‌లో స్కిల్డ్ ఆర్టిసన్స్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఆగస్ట్ 1 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

India Post Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

































మొత్తం ఖాళీలు7
ఎంవీ మెకానిక్2
ఎంవీ ఎలక్ట్రీషియన్1
వెల్డర్1
కార్పెంటర్1
టైర్‌మ్యాన్1
కాపర్ అండ్ టిన్‌స్మిత్1

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో భారీగా ఉద్యోగాలు... డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారికి అవకాశం

India Post Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఆగస్ట్ 1 సాయంత్రం 5 గంటలు

విద్యార్హతలు- 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ తప్పనిసరి. ఎంవీ మెకానిక్ పోస్టుకు హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ఎస్‌సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

జాబ్ లొకేషన్- కొయంబత్తూర్

ఎంపిక విధానం- కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్.

వేతనం- ఎంపికైన వారికి ఏడో పే కమిషన్ లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- The Manager, Mail Motor Service, Goods Shed Road, Coimbatore- 641001.

ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Clerk Jobs 2022: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే


India Post Recruitment 2022: దరఖాస్తు విధానం


Step 1- ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

Step 3- స్కిల్డ్ ఆర్టిసన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 4- నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.

Step 5- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.

Step 6- నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్

Step 7- ఫామ్ పంపాలి. దరఖాస్తుల్ని స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.

ఇండియా పోస్ట్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఇటీవల గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. ఇతర జాబ్ నోటిఫికేషన్స్ కోసం https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, India post, Job notification, JOBS, Post office

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు