Home /News /jobs /

INDIA POST RECRUITMENT 2022 INDIA POST INVITES APPLICATIONS FOR 16 STAFF CAR DRIVER POSTS KNOW HOW TO APPLY SS

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో 16 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేసిన ఇండియా పోస్ట్ (India Post) ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

ఇంకా చదవండి ...
ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వేర్వేరు సర్కిళ్లల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక పలు పోస్టల్ సర్కిళ్లల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చాయడానికి 2022 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

India Post Office Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

















మొత్తం ఖాళీలు16
చెన్నై సిటీ రీజియన్6
సెంట్రల్ రీజియన్10

TCS Internship: బీటెక్ విద్యార్థులకు అలర్ట్... టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్... అప్లై చేయండిలా

India Post Office Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఆగస్ట్ 12

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.

వయస్సు- 56 ఏళ్ల లోపు

ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- O/o the Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai 600 006

జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Teacher Jobs: 15,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీ... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


India Post Office Recruitment 2022: అప్లై చేయండి ఇలా


Step 1- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో చెన్నై మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 3- నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.

Step 5- చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.

ఇండియా పోస్ట్ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్స్ వివరాల కోసం అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, India post, Job notification, JOBS, Post office

తదుపరి వార్తలు