హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

India Post Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

India Post Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియా పోస్ట్‌లో (India Post) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం ఉంది. తాజాగా ఇండియా పోస్ట్ (India Post) లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    ఇండియా పోస్ట్‌లో (India Post) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం ఉంది. తాజాగా ఇండియా పోస్ట్ లో పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Indian Post Job Notification) విడుదల చేశారు. బెంగళూరు సర్కిల్‌లోని మోటార్ మెయిల్ సర్వీస్ కింద డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను indiapost.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 26ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనం చెల్లించనున్నారు.

    విద్యార్హతలు:

    అభ్యర్థులకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ను https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_30082022_MMS_Eng.pdf ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తు ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పత్రాలతో జత చేసి “ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు-560001” చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

    Police Jobs 2022: 12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..

    అభ్యర్థుల ఎంపిక:

    అభ్యర్థులకు తప్పనిసరిగా లైట్, హెవీ మోటార్ వాహన డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఆ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. అభ్యర్థులకు చిన్న చిన్న వాహన రిపేర్ వచ్చి ఉండాలి. అవసరమైన అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులకు థియరీ టెస్ట్ నిర్వహిస్తారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, India post, JOBS

    ఉత్తమ కథలు