హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

India Post Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియా పోస్టు నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. వివరాలివే

India Post Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియా పోస్టు నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియా పోస్ట్(India Post) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఇండియా పోస్టు(India Post) నుంచి ఇటీవల సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఇండియా పోస్టు. మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికిల్ ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్(Tyreman), పెయింటర్, ఫిట్టర్, Copper and Tin Smith, Upholster తదితర విభాగాల్లో ఖాళీలను(Jobs) భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు డిసెంబర్ 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.

  పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  పోస్టుఖాళీలు
  మోటార్ వెహికిల్ మెకానిక్6 పోస్టులు
  మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్2 పోస్టులు
  టైర్ మ్యాన్3 పోస్టులు
  పెయింటర్2 పోస్టులు
  ఫిట్టర్2 పోస్టులు
  Copper and Tin Smith 11 పోస్టు
  Upholder1 పోస్టు


  విద్యార్హతల వివరాలు:

  -సంబంధిత ట్రేడ్ లో టెక్నికల్ ఇనిస్ట్యూషన్ నుంచి సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.

  -లేదా ఎనిమిదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్ లో ఏడాది విద్యార్హత కలిగి ఉండాలి.

  -మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

  -ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది.

  ISRO Recruitment 2021: నిరుద్యోగులకు ఇస్రో శుభవార్త.. రూ. 1.12 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

  ఎలా అప్లై చేయాలంటే..

   Step 1: అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ (Application  Form) ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

   Step 2: అప్లికేషన్ ఫామ్ లో ఖాళీలను సంబంధిత వివరాలతో నింపాల్సి ఉంటుంది.

  Step 3: సూచించిన బాక్స్ వద్ద ఫొటోను అంటించాల్సి ఉంటుంది.

  Step 4: దరఖాస్తుకు వయస్సు ధ్రువీకరణ, విద్యార్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ తదితర పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.

  AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  Step 5: అప్లికేషన్ ఫామ్(Application Form) ను The Senior Manager, Mail Motor Service, C-121, Naraina Industrial Area Phase-1, Naraina, New Delhi-110028 చిరునామాకు స్పీడ్/రిజిస్టర్ పోస్టు పంపించాల్సి ఉంటుంది.

  Step 6:  దరఖాస్తులు డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, Government jobs, India post, Job notification, Postal department

  ఉత్తమ కథలు