INDIA POST RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 221 POSTAL ASSISTANT SORTING ASSISTANT POSTMAN MULTI TASKING STAFF POSTS IN DELHI POSTAL CIRCLE EVK
Post Office Jobs | ఢిల్లీ పోస్టల్ సర్కిల్లో (Delhi Postal Circle) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2021 నుంచి ప్రారంభం అవుతుంది.
పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఢిల్లీ పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ అయింది. ఢిల్లీ పోస్టల్ సర్కిల్లో (Delhi Postal Circle) పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించారు. ఉన్నాయి. పోస్ట్ ఆఫీసుల్లో కార్యాలయాల్లో పోస్టల్ అసిస్టెంట్ (Postal Assitant), పోస్ట్‌మ్యాన్ (Postman), సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi tasking Staff) లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2021 నుంచి ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి నవంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ కోసం www.indiapost.gov.in ను సందర్శంచాలి.
ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు
221
పోస్టల్ అసిస్టెంట్ (Postal Assistant)
72
పోస్ట్‌మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ (Post Man or Mail Guard)
90
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi tasking Staff)
59
దరఖాస్తు ప్రారంభం- అక్టోబర్ 4, 2021 దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 12, 2021 విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ (Intemediate) పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవ తరగతి (10th Class) పాసై ఉండాలి. వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
Step 1- అభ్యర్థులు ముందుగా indiapost.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో అక్టోబర్ 4 తరువాత అప్లికేషన్ ఫాం అందుబాటులో ఉంటుంది.
Step 3- ఫాంను డౌనల్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
Step 4- దరఖాస్తు ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 5- అప్లికేషన్‌ను
AD (Rectt),
O/o CPMG,
Delhi Circle,
Meghdoot Bhawan,
New Delhi - 110001 పోస్టు ద్వారా పంపాలి.
Step 6- దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 12, 2021
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.