హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో 221 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Post Office Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో 221 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Post Recruitment 2021 | పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs) కోరుకునేవారికి అలర్ట్. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల (Post Office Jobs) భర్తీకి ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. మొత్తం 221 పోస్టులున్నాయి. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో అంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేయాలి. ఇండియా పోస్ట్ రిలీజ్ చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2021: తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 720 క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

India Post Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు221విద్యార్హతలు
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్72ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
పోస్ట్‌మ్యాన్90ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్59టెన్త్ క్లాస్ పాస్ కావాలి.


Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో 4,103 ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

India Post Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 12

అర్హతలు- అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో సూచించిన విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా ఉండాలి.

వయస్సు- పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.100

వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్‌మ్యాన్ పోస్టుకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SBI PO Recruitment 2021: డిగ్రీ పాస్ అయినవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,065 ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే

India Post Recruitment 2021: దరఖాస్తు విధానం


Step 1- అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 2- జాబ్ నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది.

Step 3- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.

Step 4- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 5- దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Assistant Director (R&E),

O/o the Chief Postmaster General,

Delhi Circle, Meghdoot Bhawan,

New Delhi-110001

First published:

Tags: CAREER, Govt Jobs 2021, India post, Job notification, JOBS, Post office, Postal department

ఉత్తమ కథలు