హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: రూ.81,100 వేతనంతో తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

Post Office Jobs: రూ.81,100 వేతనంతో తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

Post Office Jobs: రూ.81,100 వేతనంతో తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: రూ.81,100 వేతనంతో తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో (Telangana Postal Circle) ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ అయింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో (Telangana Postal Circle) స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. పలు క్రీడల్లో ప్రతిభ సాధించినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసుల్లో, రైల్వే మెయిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 24 చివరి తేదీ.

  India Post Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు55
  పోస్టల్ అసిస్టెంట్11
  సార్టింగ్ అసిస్టెంట్8
  పోస్ట్‌మ్యాన్ లేదా మెయిల్ గార్డ్26
  మల్టీ టాస్కింగ్ స్టాఫ్10


  ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 243 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  India Post Recruitment 2021: డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు


   మొత్తం ఖాళీలు 55
   ఆదిలాబాద్ డివిజన్ 3
   పెద్దపల్లి డివిజన్ 1
   మహబూబ్‌నగర్ డివిజన్ 1
   హన్మకొండ డివిజన్ 2
   నల్గొండ డివిజన్ 1
   వనపర్తి డివిజన్ 1
   ఖమ్మం డివిజన్ 2
   నిజామాబాద్ డివిజన్ 2
   కరీంనగర్ డివిజన్ 1
   సూర్యపేట్ డివిజన్ 1
   వరంగల్ డివిజన్ 1
   హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ 5
   సికింద్రాబాద్ డివిజన్ 10
   హైదరాబాద్ సిటీ డివిజన్ 5
   సంగారెడ్డి డివిజన్ 1
   డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ (పోస్టల్), హైదరాబాద్ 1
   ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ 9
   హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ 7
   ఆఫీస్ ఆఫ్ చీఫ్ పీఎంజీ, హైదరాబాద్ (సర్కిల్ ఆఫీస్) 1


  IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 174 ఖాళీలు... అప్లై చేయండి ఇలా

  India Post Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 16

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 24

  విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు తెలుగు భాష తెలిసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవ తరగతి పాస్ కావడంతో పాటు తెలుగు భాష తెలిసి ఉండాలి.

  ఇతర అర్హతలు- జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఉండాలి.

  వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు

  దరఖాస్తు ఫీజు- రూ.200

  వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.

  Ministry of Defence Recruitment 2021: టెన్త్ అర్హతతో కేంద్ర రక్షణ శాఖలో 400 ఉద్యోగాలు... అప్లై చేయండిలా

  India Post Recruitment 2021: అప్లై చేయండి ఇలా


  Step 1- అభ్యర్థులు ముందుగా https://tsposts.in/sportsrecruitment/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో Registration పైన క్లిక్ చేయాలి.

  Step 3- పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 4- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

  Step 5- చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

  Step 6- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, India post, Job notification, JOBS, Post office, Postal department, Telangana News, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు