news18-telugu
Updated: November 1, 2019, 5:33 PM IST
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? ఉద్యోగానికి సెలెక్ట్ చేసేది ఇలాగే
(ప్రతీకాత్మక చిత్రం)
తపాలా శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాలకు 5,476 పోస్టుల్ని ప్రకటించింది. అందులో
తెలంగాణకు 970, ఆంధ్రప్రదేశ్‌కు 2707 ఖాళీలను కేటాయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఇంకా అప్లై చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల విద్యార్హత 10వ తరగతి అని ప్రకటించడంతో అనేక మంది పోటీపడుతున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారన్న అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపిక విధానం గురించి నోటిఫికేషన్లో డీటెయిల్డ్‌గా వెల్లడించింది ఇండియా పోస్ట్. నోటిఫికేషన్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Read this:
Post Office Jobs: 10వ తరగతి పాసైతే 5,476 ఉద్యోగాలు... అప్లై చేసే ప్రాసెస్ ఇదేగ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో కొనసాగుతోంది. మెరిట్ ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. ఆన్లైన్ దరఖాస్తులు కాబట్టి మెరిట్ లిస్ట్ ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది. అందుకే
దరఖాస్తు సమయంలో అన్ని వివరాలను సరిగ్గా వివరించాలి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత అని ప్రకటించింది ఇండియా పోస్ట్. కాబట్టి 10వ తరగతిలో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటుంది ఇండియా పోస్ట్. ఇంటర్, డిగ్రీ, పీజీ చదివినవారు దరఖాస్తు చేసుకున్నా వారికి ఎలాంటి వెయిటేజీ లభించదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎవరికైనా మెమోలో మార్కులు, గ్రేడ్స్ ఉంటే మార్కులతోనే అప్లై చేయాలి. ఒకవేళ గ్రేడ్స్‌తో అప్లై చేస్తే అనర్హులుగా గుర్తించే అవకాశముంది. ఒకవేళ మీ మెమోలో గ్రేడ్స్ లేదా పాయింట్స్ మాత్రమే ఉంటే వాటితో మార్కులను లెక్కిస్తారు.
Read this:
Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు
ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్(ఎక్కువ వయస్సు ఉన్నవారికే మెరిట్), ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, అన్రిజర్వ్డ్ ఫీమేల్, ఎస్టీ మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, అన్రిజర్వ్డ్ మేల్ ఆర్డర్లో మెరిట్ నిర్ణయిస్తారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 20 పోస్టులకు అప్లై చేయొచ్చు. అంటే ఒక సర్కిల్ లేదా మొత్తం సర్కిళ్లలో ఒక అప్లికేషన్ ద్వారా 20 పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థి సొంత రాష్ట్రం, ప్రాంతంలో ఎంచుకున్న పోస్టులు కూడా ఇందులోనే ఉంటాయి. అందుకే దరఖాస్తు చేసే సమయంలో 20 ప్రాంతాలను సరిగ్గా ఎంచుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా చివరకు ఒక పోస్టునే కేటాయిస్తుంది ఇండియా పోస్ట్. ఒకవేళ ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటే ప్రాధాన్యతా క్రమంలోని మొదటి పోస్టునే కేటాయిస్తారు. మిగతా పోస్టులను వదులుకోవాలి. అభ్యర్థులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో సమాచారం పూర్తిగా వెల్లడించకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.
Redmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే
Ordnance Factory Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 4,805 పోస్టులు... వివరాలివే
Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
Published by:
Santhosh Kumar S
First published:
November 1, 2019, 5:33 PM IST