Home /News /jobs /

INDIA POST PAYMENTS BANK LIMITED RELEASED JOB NOTIFICATION FOR 650 GRAMIN DAK SEVAK POSTS KNOW VACANCIES SS

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(image: IPPB)

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (image: IPPB)

India Post Gramin Dak Sevak Recruitment 2022 | ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు వస్తున్నాయి. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తుంటే, మరోవైపు ఇండియా పోస్ట్ కూడా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఇప్పటికే ఇండియా పోస్ట్ (India Post) దేశంలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 పోస్టులున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఆ తర్వాత మరో ఏడాది గడువు పొడిగించవచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. జూన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Post Office Jobs: పరీక్ష లేకుండా 38,926 ఉద్యోగాలు... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

India Post Gramin Dak Sevak Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే





































































































 మొత్తం ఖాళీలు 650
 ఆంధ్రప్రదేశ్ 34
 తెలంగాణ 21
 అస్సాం 25
 బీహార్ 76
 చత్తీస్‌గఢ్ 20
 ఢిల్లీ 4
 గుజరాత్ 31
 హర్యానా 12
 హిమాచల్ ప్రదేశ్ 9
 జమ్మూ అండ్ కాశ్మీర్ 5
 జార్ఖండ్ 8
 కర్నాటక 42
 కేరళ 7
 మధ్యప్రదేశ్ 32
 మహారాష్ట్ర 71
 ఒడిషా 20
 పంజాబ్18
 రాజస్తాన్ 35
 తమిళనాడు 45
 ఉత్తరప్రదేశ్ 84
 ఉత్తరాఖండ్ 3
 పశ్చిమ బెంగాల్ 33
 ఈశాన్య రాష్ట్రాలు 15

Post Office Jobs: తెలంగాణ, ఏపీలో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

India Post Gramin Dak Sevak Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2022 మే 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మే 20

అడ్మిట్ కార్డుల విడుదల- 2022 మే 27 తర్వాత

ఎగ్జామ్- 2022 జూన్

ఫలితాల విడుదల- 2022 జూన్

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


India Post Gramin Dak Sevak Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

అనుభవం- గ్రామీణ డాక్ సేవక్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు- 20 నుంచి 35 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.700

ఎంపిక విధానం- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 120 ప్రశ్నలకు ఉంటుంది. 120 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు. నెగిటీవ్ మార్కులు ఉండవు. కనీసం 40 మార్కులు వచ్చినవారు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయినవారికి అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

వేతనం- నెలకు రూ.30,000.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Govt Jobs 2022, India post, Job notification, JOBS, Post office

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు