హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

India Post Gramin Dak Sevak Results 2021 | పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి అలర్ట్. ఫలితాలు ఎప్పుడు విడుదలౌతాయో తెలుసుకోండి.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది ఇండియా పోస్ట్. వేర్వేరు రాష్ట్రాల్లో విడతల వారీగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటీవల తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరించింది. ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. ఈ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత. మెరిట్ ద్వారా ఎంపిక చేస్తుంది ఇండియా పోస్ట్. కాబట్టి ఎలాంటి పరీక్షలు ఉండవు. ఫలితాల విడుదల కూడా వేగంగానే జరుగుతూ ఉంటుంది. టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేయడం మామూలే. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు భారీగానే అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇప్పుడు వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Teacher Jobs 2021: మొత్తం 7,236 టీచర్ పోస్టుల ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు

Railway Jobs: రైల్వేలో 3591 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

గతంలో చూస్తే దరఖాస్తు ప్రక్రియ ముగిసిన రెండుమూడు నెలల్లోనే ఫలితాలను విడుదల చేసింది ఇండియా పోస్ట్. ఫిబ్రవరి 26న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అంటే నేటికి సరిగ్గా మూడు నెలలు. కానీ ఇంతవరకు ఫలితాల గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేస్తుందని భావించారు. మే చివరి వారంలోకి వచ్చినా ఫలితాలు ఎప్పుడు విడుదలౌతాయన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం https://appost.in/ వెబ్‌సైట్‌లో స్టేటస్ చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాల విడుదల ప్రాసెస్ ఉన్నట్టు వివరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాలకు రాష్ట్రానికి చెందిన ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి.

Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 3479 టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 10 రోజులే గడువు

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు ఎప్పుడు విడుదలౌతాయని అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఇండియా పోస్ట్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుందని భావిస్తున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం https://appost.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. ఇక పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వారిని అభ్యర్థులు నమ్మకూడదు. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. https://appost.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, India post, Job notification, JOBS, NOTIFICATION, Post office, Postal department, Upcoming jobs