హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Latest Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 3,500 పైగా ఉద్యోగాలు... జాబ్ నోటిఫికేషన్ల వివరాలు ఇవే

Latest Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 3,500 పైగా ఉద్యోగాలు... జాబ్ నోటిఫికేషన్ల వివరాలు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Latest Job Notifications | పోస్ట్ ఆఫీస్ నుంచి రైల్వే సంస్థ వరకు అనేక సంస్థలు ఇటీవల జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3500 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా? ఇంటర్మీడియట్ పూర్తి చేశారా? డిగ్రీ పూర్తైందా? ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? ఇటీవల కాలంలో చాలా జాబ్ నోటిఫికేషన్స్  (Job Notifications) వచ్చాయి. తెలంగాణలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs), ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు, మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లాంటి సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని నోటిఫికేషన్లలో కలిపి మొత్తం 3,500 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇతర అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 398 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. అప్లై చేయడానికి సెప్టెంబర్ 24 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ అయింది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 24 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AIIMS Mangalagiri Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (AIIMS) ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులున్నాయి. అప్లై చేయడానికి సెప్టెంబర్ 14 చివరి తేదీ. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (India Air Force) ఎయిర్‌ఫోర్స్ స్టేషన్స్, యూనిట్స్‌లో భారీగా 282 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

RWF Recruitment 2021: బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (Rail Wheel Factory) 192 అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Jobs) భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 13 చివరి తేదీ. పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Western Coalfields Limited) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1,281 పోస్టులున్నాయి. సెప్టెంబర్ 21 లోగా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

South Indian Bank Recruitment 2021: సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 8 చివరి తేదీ. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 243 పోస్టుల్ని ప్రకటించింది. సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

UIDAI Recruitment 2021: ఆధార్ కార్డుల జారీ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) దేశంలో పలుచోట్ల ఉన్న రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. సెప్టెంబర్ 23 లోగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మరో నోటిఫికేషన్ ద్వారా 174 ఖాళీలను భర్తీ చేస్తోంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, పెయింటర్, సూపరింటెండెంట్ లాంటి పోస్టులున్నాయి. అక్టోబర్ 2 లోగా అప్లై చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Ministry of Defence Recruitment 2021: కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం 400 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 17 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Income Tax Department Recruitment 2021: ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. ఫుల్ టైమ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అప్లై చేయడానికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.

NIACL Recruitment 2021: ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 21 చివరి తేదీ. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, India post, Job notification, JOBS, Post office, Railway jobs

ఉత్తమ కథలు