Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి విద్యార్హతలు, వేతనాల వివరాలివే

India Post Gramin Dak Sevak Recruitment 2019 | ఇండియా పోస్ట్ మూడు రకాల పోస్టుల్ని పోస్టుల్ని భర్తీ చేయనుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

news18-telugu
Updated: November 5, 2019, 3:46 PM IST
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి విద్యార్హతలు, వేతనాల వివరాలివే
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి విద్యార్హతలు, వేతనాల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత తపాలా శాఖ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2707, తెలంగాణలో 970 ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అప్లై చేసే అభ్యర్థులకు అర్హతలు, భర్తీ చేయనున్న పోస్టులు, వేతనాలపై పలు అనుమానాలున్నాయి. వాటన్నింటికీ నోటిఫికేషన్‌లో సమాధానాలున్నాయి. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం చూస్తే ఇండియా పోస్ట్ మూడు రకాల పోస్టుల్ని పోస్టుల్ని భర్తీ చేయనుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Read this: Post Office Jobs: 10వ తరగతి పాసైతే 5,476 ఉద్యోగాలు... అప్లై చేసే ప్రాసెస్ ఇదే

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యాథ్స్, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్స్‌తో 10వ తరగతి పాస్ కావాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలో 10వ తరగతి పాసైనవాళ్లు అర్హులు. 10వ తరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారికంటే మొదటి ప్రయత్నంలో పాసైనవారిని ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. అంటే మెరిట్ వారికే ముందు ఉంటుంది. ఇక అభ్యర్థులకు స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. అంటే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు భాష తెలిసి ఉండాలి. 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ ఉండాలి. అభ్యర్థులకు 60 రోజుల వ్యవధి గల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉండాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినవాళ్లు అర్హులు. ఒకవేళ మెట్రిక్యులేషన్, 12వ తరగతిలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ అవసరం లేదు.

Read this: Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? ఉద్యోగానికి సెలెక్ట్ చేసేది ఇలాగే

ఏఏ పోస్టాఫీస్ పరిధిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయో నోటిఫికేషన్‌లో వెల్లడించింది ఇండియా పోస్ట్. ఇక ఈ పోస్టులకు వేతనాల వివరాలు కూడా నోటిఫికేషన్‌లో చూడొచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు లెవెల్ 1 ఉద్యోగులకు రూ.12,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.14,500. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ లెవెల్ 1 ఉద్యోగులకు రూ.10,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.12,000.

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IBPS SO 2019: డిగ్రీ అర్హతతో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

Indian Navy Jobs: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్

Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: November 5, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading