India Post Results: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాలొచ్చాయి... ఏపీ, తెలంగాణలో సెలెక్ట్ అయింది వీళ్లే

India Post Gramin Dak Sevak Recruitment Results | అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టులకు ఎలాంటి పరీక్షలు లేవు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది ఇండియా పోస్ట్.

news18-telugu
Updated: January 28, 2020, 11:03 AM IST
India Post Results: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాలొచ్చాయి... ఏపీ, తెలంగాణలో సెలెక్ట్ అయింది వీళ్లే
India Post Results: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాలొచ్చాయి... ఏపీ, తెలంగాణలో సెలెక్ట్ అయింది వీళ్లే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఇటీవల ఇండియా పోస్ట్ చేపట్టిన గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేశారా? ఫలితాలను విడుదలయ్యాయి. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు రాష్ట్రాల్లో విడతల వారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఒకేసారి దరఖాస్తుల్ని స్వీకరించింది. మూడు రాష్ట్రాల్లో 5,476 బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరించింది ఇండియా పోస్ట్. తెలంగాణలో 970, ఆంధ్రప్రదేశ్‌లో 2707 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కావడంతో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టులకు ఎలాంటి పరీక్షలు లేవు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది ఇండియా పోస్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో ఎంపికైన వారి జాబితాను http://www.appost.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మరి మీరు ఎంపికయ్యారో లేదో తెలుసుకోండి.

India Post GDS Results: ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి



ముందుగా http://www.appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎంపికైన వారి జాబితాలు కనిపిస్తాయి.
Chhattisgarh-1799 Posts, Telangana-970 Posts, Andhra Pradesh-2707 Posts పేరుతో లింక్స్ ఉంటాయి.
మీరు ఏ రాష్ట్రంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అప్లై చేస్తే ఆ రాష్ట్రంల లింక్ క్లిక్ చేయాలి.
పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు దరఖాస్తు చేసిన ప్రాంతంలో ఎంపికైనవారి పేర్లు ఉంటాయి.తెలంగాణలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎంపికైనవారి జాబితా కోసం నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎంపికైనవారి జాబితా కోసం నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది ఇండియా పోస్ట్. వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Army SSC Recruitment 2020: ఆర్మీలో 191 ఉద్యోగాలు... పెళ్లికాని యువతీయువకులకు అవకాశం

SBI Jobs: ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...

School Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్... మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు
Published by: Santhosh Kumar S
First published: January 28, 2020, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading