Home /News /jobs /

INDIA POST GIVES CLARITY ON TELANGANA AND ANDHRA PRADESH GRAMIN DAK SEVAK RECRUITMENT RESULTS SS

India Post GDS Results 2021: గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన ఇండియా పోస్ట్

India Post GDS Results 2021: గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన ఇండియా పోస్ట్
(ప్రతీకాత్మక చిత్రం)

India Post GDS Results 2021: గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన ఇండియా పోస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

India Post GDS Results 2021 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన లక్షలాది మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలపై ఇండియా పోస్ట్ క్లారిటీ ఇచ్చింది.

    దేశవ్యాప్తంగా గ్రామీణ్ డాక్ సేవక్-GDS పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఇండియా పోస్ట్... తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. ఈ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత కావడం, ఎలాంటి పరీక్షలు లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేయనుండటంతో భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాలకు అప్లై చేశారు అభ్యర్థులు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు లక్షల సంఖ్యలో దరఖాస్తు చేశారు. అయితే మూడు నెలలు గడిచినా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ట్విట్టర్ ద్వారా ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియా పోస్ట్ క్లారిటీ ఇచ్చింది.

    తెలంగాణలో ఫలితాల విడుదల ఆలస్యానికి గల కారణాన్ని ఇండియా పోస్ట్ ట్విట్టర్‌లో వివరించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాల అమలు ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉందని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది ఇండియా పోస్ట్.

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఇదే

    Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే


    ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ డాక్ సేవ్ పోస్టుల ఫలితాల గురించీ అభ్యర్థులు ట్విట్టర్‌లో పోస్టల్ శాఖను సంప్రదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్థులు ఫలితాల కోసం 0866-2429821/822/824 నెంబర్లను లేదా rectt.ap@indiapost.gov.in ఇమెయిల్ ఐడీలో సంప్రదించాలని ఇండియా పోస్ట్ ట్విట్టర్‌లో వివరించింది.


    ఇక తాజాగా జార్ఖండ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది ఇండియా పోస్ట్. జార్ఖండ్‌లో 1118 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో దరఖాస్తుల్ని స్వీకరించింది ఇండియా పోస్ట్. ఐదు నెలల తర్వాత ఫలితాలను విడుదల చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి.

    Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేస్తుందని భావించారు. కానీ ఫలితాలు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఫలితాల కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://appost.in/ ఫాలో కావాలి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వారిని అభ్యర్థులు నమ్మకూడదు. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: India post, Post office

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు