Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్

India Post Jobs 2020 | ఇండియా పోస్ట్‌ ప్రతీ ఏటా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియపై ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది.

news18-telugu
Updated: August 21, 2020, 11:20 AM IST
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలపై ఇండియా పోస్ట్ శుభవార్త చెప్పింది. గ్రామీణ్ డాక్ సేవక్ రెండో విడత రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని ఇండియా పోస్ట్ ప్రకటించింది. మిగిలిన సర్కిళ్లలో ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రెండో విడత రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జాప్యం జరుగుతోంది. దీంతో అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇండియా పోస్ట్‌కు అనేక అభ్యర్థనలు పంపుతున్నారు. వీటిపై ఇండియా పోస్ట్ అధికారికంగా స్పందించింది. ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తామన్న తేదీని స్పష్టం చేయలేమని, కానీ ఫలితాలు వెల్లడించే ప్రక్రియ కొనసాగుతోందని, ఫలితాలు రాగానే అభ్యర్థులకు ఎస్ఎంఎస్‌లో సమాచారం అందుతుందని, గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్‌లైన్ సైట్‌లో లిస్ట్ అప్‌లోడ్ చేస్తామని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది.

గ్రామీణ్ డాక్ సేవక్ రెండో విడత రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫలితాలను చాలా సర్కిళ్లలో విడుదల చేసింది. కొన్ని సర్కిల్స్‌లో మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే పలు సర్కిల్స్‌లో ఎంపికైనవారు విధుల్లో చేరకపోతే ఆ ఖాళీలను మళ్లీ ప్రకటిస్తున్నామని ఇండియా పోస్ట్ వివరించింది. అంటే ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తైన సర్కిళ్లలో కూడా ఏవైనా ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేసేందుకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇండియా పోస్ట్. ప్రస్తుతం గ్రామీణ్ డాక్ సేవక్ నియామక ప్రక్రియ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేసింది. పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను నమ్మొద్దని ఇండియా పోస్ట్ హెచ్చరిస్తోంది. ఎవరైనా పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే అభ్యర్థులు నమ్మకూడదని సూచిస్తోంది. ఎస్ఎంఎస్ ద్వారానే అధికారిక సమాచారాన్ని అందిస్తామని చెబుతోంది.

Jobs: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు

ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్

ప్రస్తుతం రెండో విడత గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ లాంటి పోస్టులు ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు లెవెల్ 1 ఉద్యోగులకు రూ.12,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.14,500, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ లెవెల్ 1 ఉద్యోగులకు రూ.10,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.12,000 వేతనం లభిస్తుంది. పదవ తరగతి అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది ఇండియా పోస్ట్. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైనవారు దరఖాస్తు చేసినా 10వ తరగతిలో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల కోసం http://appost.in/gdsonline వెబ్‌సైట్ ఫాలో కావాలి.
Published by: Santhosh Kumar S
First published: August 21, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading