Home /News /jobs /

INDIA POST GDS RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 38926 GRAMIN DAK SEVAK BRANCH POSTMASTER AND ASSISTANT BRANCH POSTMASTER POSTS KNOW NOTIFICATION DETAILS SS

Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 38,926 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... పరీక్ష లేకుండా ఉద్యోగం

Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 38,926 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... పరీక్ష లేకుండా ఉద్యోగం
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 38,926 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... పరీక్ష లేకుండా ఉద్యోగం (ప్రతీకాత్మక చిత్రం)

India Post GDS Recruitment 2022 | పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా 38,926 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. పదవ తరగతి అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్.

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పలు రాష్ట్రాల్లో 38,926 పోస్టులు ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులున్నాయి. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జూన్ 5 చివరి తేదీ. 2022 నవంబర్ 15 లోగా ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తోంది.

పదవ తరగతి పాసైనవారంతా ఈ పోస్టులకు ప్లై చేయొచ్చు. ఇండియా పోస్ట్ ఈ ఖాళీలను మెరిట్ ద్వారా ఎంపిక చేస్తోంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని ఖాళీలకు ఎంపిక చేయనుంది. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

India Post GDS Recruitment 2022: రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే





























































































 మొత్తం ఖాళీలు 38,926
 ఆంధ్రప్రదేశ్ 1716
 తెలంగాణ 1226
 అస్సాం 1143
 బీహార్ 990
 ఛత్తీస్‌గఢ్ 1253
 ఢిల్లీ 60
 గుజరాత్ 1901
 హర్యానా 921
 హిమాచల్ ప్రదేశ్ 1007
 జమ్మూ కాశ్మీర్ 265
 జార్ఖండ్ 610
 కర్ణాటక 2410
 కేరళ 2203
 మధ్యప్రదేశ్ 4074
 మహారాష్ట్ర 3026
 పంజాబ్ 969
 రాజస్థాన్ 2890
 తమిళనాడు 4810
 ఉత్తర ప్రదేశ్ 2519
 ఉత్తరాఖండ్ 353
 పశ్చిమ బెంగాల్ 1963

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


India Post GDS Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2022 మే 2

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 5

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.

ఇతర అర్హతలు- స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

వయస్సు- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు.

వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000.

ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్- 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Central Government Jobs, Govt Jobs 2022, India post, Job notification, JOBS, Post office

తదుపరి వార్తలు