Home /News /jobs /

INDIA POST GDS RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS TOMORROW FOR 2296 GRAMIN DAK SEVAK POSTS IN POST OFFICES IN ANDHRA PRADESH KNOW HOW TO APPLY SS

AP Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 2296 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

AP Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 2296 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

AP Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 2296 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

AP Post Office Jobs | ఆంధ్రప్రదేశ్‌లో 2296 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి ఫిబ్రవరి 26 చివరి తేదీ. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్... తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరి 26 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://appost.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల్ని మాత్రమే స్వీకరిస్తోంది ఇండియా పోస్ట్. ఫిజికల్ అప్లికేషన్లను స్వీకరించేట్లేదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ మొత్తం చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

    India Post Gramin Dak Sevak Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు ఇవే...


    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు- 2296
    జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947
    ఓబీసీ- 507
    ఈడబ్ల్యూఎస్- 324
    PWD-A- 18
    PWD-B- 34
    PWD-C- 35
    PWD-DE- 9
    ఎస్సీ- 279
    ఎస్టీ- 143

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఇదే

    Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రాసెస్ ఇదే



    India Post Gramin Dak Sevak Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.
    ఇతర అర్హతలు- స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌, దివ్యాంగులకు ఫీజు లేదు.
    వయస్సు- 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు
    ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
    వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000.

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... విద్యార్హతలు, వేతనాల వివరాలివే

    Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు

    India Post Gramin Dak Sevak Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
    రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు.
    ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
    పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది.
    అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    మూడో స్టెప్‌లో పోస్టు ఎంచుకోవాలి.
    మూడు స్టెప్స్ పూర్తైన తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, India post, Job notification, JOBS, NOTIFICATION, Post office, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు