• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIA POST GDS RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON 1150 GRAMIN DAK SEVAK POSTS IN POST OFFICES IN TELANGANA KNOW HOW TO APPLY SS

Telangana Post Office Jobs: టెన్త్ పాసయ్యారా? తెలంగాణలో 1150 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

Telangana Post Office Jobs: టెన్త్ పాసయ్యారా? తెలంగాణలో 1150 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

Telangana Post Office Jobs: టెన్త్ పాసయ్యారా? తెలంగాణలో 1150 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

India Post Gramin Dak Sevak Recruitment 2021 | దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఇండియా పోస్ట్ తెలంగాణకు 1150 పోస్టుల్ని ప్రకటించింది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://appost.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

    India Post Gramin Dak Sevak Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే


    తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు- 1150
    జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484
    ఓబీసీ- 279
    ఈడబ్ల్యూఎస్- 130
    PWD-A- 9
    PWD-B- 14
    PWD-C- 15
    ఎస్సీ- 154
    ఎస్టీ- 65

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఇదే

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... విద్యార్హతలు, వేతనాల వివరాలివే

    India Post Gramin Dak Sevak Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.
    ఇతర అర్హతలు- స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌, దివ్యాంగులకు ఫీజు లేదు.
    వయస్సు- 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు
    ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
    వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000.

    Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రాసెస్ ఇదే

    Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో 3446 పోస్ట్ ఆఫీస్ జాబ్స్... ఎవరు అప్లై చేయాలి? జీతం ఎంత? తెలుసుకోండి

    India Post Gramin Dak Sevak Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
    రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు.
    ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
    పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది.
    అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    మూడో స్టెప్‌లో పోస్టు ఎంచుకోవాలి.
    మూడు స్టెప్స్ పూర్తైన తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: