హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల (Gramin Dak Sevak Jobs) ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్. అభ్యర్థులు మరోసారి ఆప్షన్స్ సెలెక్ట్ చేయడానికి అప్లికేషన్ విండో ఓపెన్ చేసింది ఇండియా పోస్ట్.

  ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలను (Post Office Jobs) భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండు నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. సాధారణంగా రెండు నెలల్లోపే ఫలితాలు వస్తుంటాయి. కానీ 8 నెలలైనా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను వెల్లడించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ ఆదేశాల మేరకు విత్‌హెల్డ్ పోస్టుల స్థానంలో అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియా పోస్ట్.

  APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్‌హెల్డ్ పోస్టుల్ని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆప్షన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ మార్చుకోకపోతే గతంలో సబ్మిట్ చేసిన దరఖాస్తును విత్‌హెల్డ్ పోస్టులకు పరిగణలోకి తీసుకోరు. 2021 నవంబర్ 18 లోగా అభ్యర్థులు ఆప్షన్స్ మార్చుకోవాలి. https://appost.in/ వెబ్‌సైట్‌లోనే గతంలో లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఆప్షన్స్ మార్చుకోవాలి. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఈ పోస్టులకు ఇండియా పోస్ట్ ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

  India Post Gramin Dak Sevak Recruitment 2021: తెలంగాణలోని ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు1150
  జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్484
  ఓబీసీ279
  ఈడబ్ల్యూఎస్130
  PWD-A9
  PWD-B14
  PWD-C15
  ఎస్సీ154
  ఎస్టీ65


  IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  India Post Gramin Dak Sevak Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు2296
  జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్947
  ఓబీసీ507
  ఈడబ్ల్యూఎస్324
  PWD-A18
  PWD-B34
  PWD-C35
  PWD-DE9
  ఎస్సీ279
  ఎస్టీ143


  AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  India Post Gramin Dak Sevak Recruitment 2021: ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేయాలంటే


  Step 1- అభ్యర్థులు ముందుగా https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- Apply Online పైన క్లిక్ చేసి Apply పైన క్లిక్ చేయాలి.

  Step 3- రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, సర్కిల్ పైన క్లిక్ చేయాలి.

  Step 4- Submit పైన క్లిక్ చేసి లాగిన్ చేయాలి.

  Step 5- గతంలో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది.

  Step 6- ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి.

  Step 7- గరిష్టంగా 20 ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు.

  Step 8- ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, India post, Job notification, JOBS, Post office, Postal department

  ఉత్తమ కథలు