Home /News /jobs /

INDIA POST GDS 2022 RESULTS DECLARED FOR TELANGANA CIRCLE HERE DETAILS NS

India Post GDS 2022 Results: ఇండియా పోస్టు జీడీఎస్ తెలంగాణ ఫలితాలు విడుదల.. లిస్ట్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియా పోస్టు జీడీఎస్ కు సంబంధించి తెలంగాణ సర్కిల్ కు సంబంధించిన ఫలితాలను పోస్టల్ శాఖ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

    తెలంగాణ, ఏపీల్లోని తపాలా విభాగంలో సేవలు అందించడానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ప్రకటనను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 5కు ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇందుకు సంబంధించి ఏపీలో 1716 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 1226 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక నిర్వహించారు అధికారులు. తాజాగా ఇందుకు సంబంధించిన (GDS Telangana Results) ఫలితాలు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అభ్యర్థులు కింద జత చేయబడిన పీడీఎఫ్ లో చెక్ చేసి తాము ఎంపికయ్యారా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు.  ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తుల్ని స్వీకరించింది. 2022 జూన్ 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ 2022 నవంబర్ 15 లోగా ముగిస్తామని ఇండియా పోస్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. గతంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ఆలస్యంగా జరిగిన విషయం తెలిసిందే. ఈసారి ఆలస్యం లేకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తోంది.

    ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది ఇండియా పోస్ట్. ఆయా రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ లో ఫలితాలు చెక్ చేయొచ్చు. తాజాగా తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్లో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.


    ఇదే వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అప్‌డేట్ చేస్తుంది ఇండియా పోస్ట్. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా చెక్ చేసేందుకు అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Shortlisted Candidates పైన క్లిక్ చేయాలి. రాష్ట్రాల వారీగా జాబితా కనిపిస్తుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి సమాచారం కూడా అందుతుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఎస్ఎంఎస్, ఇమెయిల్ రాకపోతే తమ బాధ్యత కాదని ఇండియా పోస్ట్ చెబుతోంది. కాబట్టి అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: India post, India post payments bank, Post office

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు