INDIA LOCKDOWN KNOW ABOUT 5 BEST CODING COURSES IN ONLINE TO SHARPEN YOUR SKILLS SS
Best Coding Courses: ఇంట్లోనే ఉంటూ కోడింగ్ కోర్స్ నేర్చుకోండి ఇలా
Best Coding Courses: ఇంట్లోనే ఉంటూ కోడింగ్ కోర్స్ నేర్చుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Best Coding Courses | నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. లాక్డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ కోర్సుల్ని నేర్చుకోవచ్చు.
వెబ్ డెవలప్మెంట్ నుంచి డేటా సైన్స్ వరకు కోడింగ్ స్కిల్స్ తప్పనిసరి. మీరు సొంత వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, మీ సొంత ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేయాలన్నా కోడింగ్ తెలిసి ఉండాలి. మరి లాక్డౌన్లో ఉన్న ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఆన్లైన్లోనే కోడింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆన్లైన్ కోడింగ్ నేర్చుకోండి.
WEB DEVELOPER BOOTCAMP: వెబ్ డెవలపర్ బూట్‌క్యాంప్ కోర్సును అందిస్తోంది యుడెమీ. ఫీజు కూడా తక్కువే. కేవలం రూ.455 ధరకే ఈ కోర్సును అందిస్తోంది యుడెమీ. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌లో కేడింగ్ నేర్చుకోవచ్చు. 46.5 గంటల వీడియోలు, 81 ఆర్టికల్స్, 104 డౌన్‌లోడబుల్ రీసోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
PYTHON FOR EVERYBODY: కోర్స్ఎరా ఉచితంగా అందిస్తున్న పైథాన్ ప్రోగ్రామ్ ఇది. పైథాన్ సిమాంటిక్స్, టెక్నిక్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, వెబ్స్క్రాపింగ్, డేటా స్ట్రక్చరింగ్ నేర్చుకోవచ్చు. 8 నెలల కోర్స్ ఇది. వారానికి రెండు గంటలు కేటాయిస్తే చాలు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
INTRODUCTORY PROGRAMMING COURSES: మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు అంశాల్లో కోర్సుల్ని అందిస్తోంది. డేటా సైన్స్, బేసిక్ ప్రోగ్రామింగ్, పైథాన్, జావా, మ్యాట్‌ల్యాబ్, C/C++ లాంటి కోర్సుల్ని ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఉచిత కోర్సులే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
DATA VISUALISATION: ఫ్రీ కోడ్ క్యాంప్ ఉచితంగా కోర్సుల్ని అందిస్తోంది. సుమారు 300 గంటల పాటు సమగ్ర కోర్సులు నేర్చుకోవచ్చు. డేటా విజువలైజేషన్ లెస్సన్స్, టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
JAVA, SQL AND MORE: ఖాన్ అకాడమీ అనేక కోర్సుల్ని అందిస్తోంది. జావా స్క్రిప్ట్, HTML/CSS, SQL లాంటివి నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.