INDIA IT SECTOR WILL REQUIRE MORE THAN FIVE LAKH PROFESSIONALS IN THE FUTURE HERE IS THE DETAILS AK GH
IT Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
ఫ్రతీకాత్మక చిత్రం
భారత్‌లో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ గణనీయంగా అభివృద్ధి చెందేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల సమయం పట్టింది. చాలా యువ పారిశ్రామికవేత్తలు వేలాది స్టార్టప్‌లను స్థాపించి సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్నారు.
ప్రపంచంలో డిజిటలైజేషన్, ఆటోమేషన్ గణనీయంగా పెరుగుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం పరుగులు పెడుతోంది. భారత్‌లో ముఖ్యంగా ఐటీలోని సాఫ్ట్వేర్- యాజ్-ఏ సర్వీస్ (SaaS/సాస్) ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతోంది. ఓవరాల్ ఐటీ మార్కెట్‌తో పోలిస్తే రెట్టింపు వేగంతో దూసుకెళుతోంది. 2030 నాటికి ఎస్‌ఏఏఎస్‌లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
సాఫ్ట్వేర్-యాజ్-ఏ-సర్వీస్ విభాగంలో దేశంలో ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా స్టార్టప్‌లు ఉండగా.. 10 భారీ సంస్థలు పని చేస్తున్నాయి. మొత్తంగా అన్నీ కలిపి సంవత్సరానికి 3 బిలియన్ డాలర్ల సబ్స్క్రిప్షన్ ఆదాయాన్ని పొందుతున్నాయని ఎస్ఏఏఎస్ భూమి అనే ఇండస్ట్రీ ఫౌండర్స్ కమ్యూనిటీ నివేదిక వెల్లడించింది. కన్సల్టెన్సీ మెక్కిన్సే అండ్ కో, మనదేశానికి చెందిన సాఫ్ట్వేర్ రంగ ట్రేడ్ గ్రూప్ నాస్కామ్ కూడా ఈ నివేదికలో పాలుపంచుకుంది.
సాఫ్ట్వేర్-యాజ్- ఏ-సర్వీస్ విభాగంలో 2030 నాటికి దేశంలో 10 భారీ సంస్థలు ఉంటాయని, వీటి విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. “ప్రస్తుతం ఐటీలోని ఈ ఎస్ఏఏఎస్ విభాగంలో 40వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలానే ఉంటే 2030 నాటికి ఈ సంస్థలు 70 బిలియన్ డాలర్ల రెవెన్యూను సాధిస్తాయి. ప్రపంచ మార్కెట్ కన్నా ఇది ఆరు శాతం ఎక్కువ. అయితే 2030 నాటికి దేశంలో ఎస్‌ఏఏఎస్‌ల విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా” అని నివేదిక స్పష్టం చేసింది.
భారత్‌లో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ గణనీయంగా అభివృద్ధి చెందేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల సమయం పట్టింది. చాలా యువ పారిశ్రామికవేత్తలు వేలాది స్టార్టప్‌లను స్థాపించి సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్నారు. బిల్లింగ్ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకు చాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్లౌడ్ ద్వారా ఇవి సబ్స్క్రిప్షన్ సర్వీసులుగా ఉన్నాయి. ఈ కోవలోకి చెందిన భారత సంస్థ చార్జ్బీ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ కాగా.. ఫ్రెష్‌వర్క్స్ లాంటి కంపెనీలు విస్తృతమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నాయి.
అయితే ప్రారంభంలో చాలా స్టార్టర్లు పెట్టుబడులు లేక, నైపుణ్యాలున్న టాలెంటెడ్ ఉద్యోగులను ఆకర్షించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతమున్న పెట్టుబడులతో కంటే రానున్న 10 సంవత్సరాల్లో మూడు, నాలుగు రెట్లు పెట్టుబడులు పెరిగితేనే ఎస్ఏఏఎస్ రంగం 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది.
సవాళ్లను పక్కనపెడితే ఎస్ఏఏఎస్ వేగంగా అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ రంగం వార్షిక వృద్ధి రేటు ప్రస్తుతం ఎనిమిది శాతంగా ఉందని, మొత్తం ఐటీ మార్కెట్ కంటే ఇది రెట్టింపు అని స్పష్టం చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.