బ్యాంక్‌లో(Bank) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్(IndiaExim Bank) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) ప్రక్రియలో మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibpsonline.ibps.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు ఇలా..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 45 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇందులో
మేనేజర్ (లా) 2 పోస్టులు,
మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 2 పోస్టులు,
మేనేజ్‌మెంట్ ట్రైనీ 41 పోస్టులు ఉన్నాయి.
మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు ఇలా..
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 12, ఎస్సీ 03, ఎస్సటీ 03, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులకు 09, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 03, దివ్యాంగులకు 03 పోస్టులను కేటాయించారు. మొత్తం మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు 30 ఖాళీగా ఉన్నాయి.
స్పెషల్ రిక్రూట్ మెంట్ విభాగంలో.. మనేజర్ (ఎంఎం 2) లో ఎస్టీ అభ్యర్థులకు 02, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ కు 02 మొత్తం 4 పోస్టులు.. మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎంటీ) విభాగంలో ఎస్సీ 07, ఎస్టీ 03, ఓబీసీ(నాన్ క్రీమిలేయర్) 01 పోస్టులను కేటాయించారు. మొత్తం ఈ విభాగంలో 11 పోస్టులను కేటాయించారు. ఇలా
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ 30, స్పెషల్ రిక్రూట్ మెంట్ 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత..
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ ఇన్ లా స్పెషలైజేషన్, BE/B.Tech, గ్రాడ్యుయేషన్/MBA/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిగ్రీ కలిగి ఉండాలి. అంతే కాకుండా.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
నవంబర్ 4, 2022 నాటికి అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము..
రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600 మరియు SC/ST/PWD/EWS/మహిళల అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించాలి.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.69,810తోపాటు ఇతర అలవెన్సులు చెల్లించబడతాయి.
ఎంపిక ఇలా..
అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. రాత పరీక్ష 2022 నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ జనవరి/ఫిబ్రవరి 2023లో జరుగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-తర్వాత కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలను తెలుసుకోండి.
-ఈ లింక్ పై క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
-తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్ వర్డ్ వివరాలను నమోదు చేసి దరఖాస్తులను పూర్తి చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2021, Bank Jobs 2022, Career and Courses, JOBS