హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Payroll: గత ఆర్థిక సంవత్సరంలో 1.46 కోట్ల పేరోల్స్.. మహిళల నమోదులో 27% పెరుగుదల: ఎస్‌బీఐ రిపోర్ట్

Payroll: గత ఆర్థిక సంవత్సరంలో 1.46 కోట్ల పేరోల్స్.. మహిళల నమోదులో 27% పెరుగుదల: ఎస్‌బీఐ రిపోర్ట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా ప్రభావం తగ్గడంతో ఉద్యోగాల (Jobs) సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ (SBI Research Report) ఉద్యోగాల సృష్టి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కరోనా (Corona) వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత భారతదేశంలో అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగాల (Jobs) సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ (SBI Research Report) ఉద్యోగాల సృష్టి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఈపీఎఫ్​ఓ (EPFO) ​​ద్వారా 1.38 కోట్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా 7.8 లక్షల మందితో సహా 1.46 కోట్ల పేరోల్‌ను సృష్టించింది. ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో 94.7 లక్షలతో పోలిస్తే చాలా అధికం. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మహిళల నమోదు కూడా 27 శాతానికి పెరిగిందని ఎస్‌బీఐ పేర్కొంది.

“ఈపీఎఫ్​ఓ డేటా ప్రకారం 138.2 లక్షల పేరోల్‌ను విభజించినపుడు రెండవ పేరోల్ ద్వారా 60 లక్షలు, మొదటి పేరోల్ ద్వారా 67 లక్షలు.. ఫార్మలైజేషన్ ద్వారా 11.2 లక్షల మంది నమోదైనట్లు తేలింది. ఇంక్రిమెంట్ పరంగా, ఫైనాన్షియర్ ఇయర్ 2021 కంటే ఫైనాన్షియర్ ఇయర్ 2022లో 45 లక్షల పేరోల్ జతయ్యాయి. మొదటి సారి పేరోల్‌లో 16 లక్షలు, రెండవ సారి పేరోల్‌లో 25.8 లక్షలు, ఫార్మలైజేషన్ 1.9 లక్షలు పెరిగింది" అని ఎస్‌బీఐ ఏకోవ్రాప్ (SBI Ecowrap) తెలిపింది.

ఫైనాన్షియల్ ఇయర్ 2022 తర్వాతి భాగంలో ప్రజలు లేబర్ మార్కెట్‌కి తిరిగి వస్తున్నారని ఎస్‌బీఐ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో (MSME) ఫార్మలైజేషన్ రేటు కూడా 1.9 లక్షలు పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో కొత్త ఉద్యోగాలు బాగా క్షీణించిన తర్వాత.. FY22లో 1.5 లక్షల NPS పెరుగుదల ఉందని ఎన్‌పీఎస్ (NPS) డేటా సూచిస్తుంది. పెరిగిన పేరోల్ నమోదులు భారతీయ కార్మిక మార్కెట్‌ మెరుగ్గా పుంజుకున్నట్లు సూచిస్తున్నాయని పేర్కొంది.

ఈపీఎఫ్​ఓ డేటాలో మహిళల నమోదు మొత్తం నిష్పత్తి FY20లో 23 శాతంగా ఉందని.. FY21లో కూడా అదే మొత్తంలోనే నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి పెరిగింది. 2,000 కంటే ఎక్కువ లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగుల ఖర్చుల డేటాను విశ్లేషించామని... FY22లో అతి చిన్న కంపెనీలను (టర్నోవర్‌ రూ. 50 కోట్ల వరకు) మినహాయించి ఉద్యోగుల ఖర్చులు రెండంకెల్లో పెరిగాయని గుర్తించామని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.

"ఫైనాన్షియల్ ఇయర్ 2021లో, పెద్ద కంపెనీలు (రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్) మినహా అన్ని కంపెనీల్లో ఉద్యోగుల ఖర్చులు తగ్గాయి. ఎఫ్‌వై 22లో కంపెనీలు నియామకాలు ప్రారంభించాయని ఈ టర్న్‌అరౌండ్ సూచిస్తుంది" అని నివేదిక పేర్కొంది. కరోనావైరస్ సమయంలో అధికారిక ఉద్యోగాలు క్షీణించగా, FY21 లో ఆర్థిక పొదుపులు పెరిగాయని పేర్కొంది. "గృహ రంగానికి సంబంధించిన ఆర్థిక పొదుపు, అత్యంత ముఖ్యమైన నిధుల వనరు FY21లో జీఎన్‌డీఐ (Gross National Disposable Income)లో 3.6 శాతం పెరిగి 11.5 శాతానికి చేరుకుంది" అని రిపోర్ట్ వెల్లడించింది.. ఇన్సూరెన్స్, ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్‌లలో డిపాజిట్లు కాకుండా చాలా గుర్తించదగిన పెరుగుదల కనిపించిందని.. ఇలాంటి మార్పును స్వాగతిస్తున్నామని ఎస్‌బీఐ ఎకనామిస్ట్స్‌ పేర్కొన్నారు.

First published:

Tags: EPFO, JOBS

ఉత్తమ కథలు