Jobs: కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే...

Jobs | టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ విస్తృతం అవుతోంది. ఫలితంగా ఆన్‌లైన్ ట్యూటర్, ఇ-ఎడ్యుకేటర్ ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. వేతనాలు కూడా బాగానే ఉంటున్నాయి.

news18-telugu
Updated: September 4, 2019, 3:16 PM IST
Jobs: కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే...
Jobs: కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 4, 2019, 3:16 PM IST
కెరీర్... విద్యార్థులకు చాలా ముఖ్యమైన అంశం. విద్యార్థి దశలోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అయితే కొత్తకొత్త రంగాలు పుట్టుకొస్తున్నకొద్దీ కెరీర్‌లో మార్పులు వస్తున్నాయి. మరి ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఏవో తెలుసా? టీచింగ్ జాబ్స్. 2018-19లో 40 శాతం మంది టీచింగ్ జాబ్స్ గురించే సెర్చ్ చేశారని జాబ్ సైట్ ఇండీడ్ అధ్యయనం తేల్చింది. డిజిటల్ మీడియా విస్తృతం కావడంతో ఆన్‌లైన్ ట్యూటర్స్, ఇ-ఎడ్యుకేటర్స్ లాంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని ఇండీడ్ నివేదిక వెల్లడించింది. 2016 జూలై నుంచి 2019 జూలై వరకు మూడేళ్లలో 41 శాతం మంది టీచింగ్ ఉద్యోగాల కోసమే సెర్చ్ చేశారని ఇండీడ్ లెక్కలు చెబుతున్నాయి. 2018-19లో 40 శాతం మంది టీచర్ ఉద్యోగాల కోసం సెర్చ్ చేశారట. మూడేళ్ల క్రితం అంటే 2016-17 లో 11 శాతం మంది మాత్రమే టీచర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తే, 2017-18లో 14 శాతానికి పెరగడం విశేషం.

విద్యార్థుల జీవితంపై ఉపాధ్యాయులు తీవ్రమైన ప్రభావం చూపించడమే కాదు... వారి భవిష్యత్తును తీర్చిదిద్దే సత్తా ఉంటుంది. మన అందరి జీవితాలపై ఉపాధ్యాయుల ప్రభావం ఉంది. మనల్ని నమ్మడమే కాదు... మన కెరీర్‌ను కావాల్సినట్టుగా తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహించారు. గత మూడేళ్లలో టీచర్ ఉద్యోగాలకు 41% డిమాండ్ పెరిగింది. ఇ-లెర్నింగ్, ఆన్‌లైన్ టీచింగ్ లాంటి ప్రొఫెషన్‌ వృద్ధి చెందుతోంది.
శశి కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఇండీడ్ ఇండియా


టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ విస్తృతం అవుతోంది. ఫలితంగా ఆన్‌లైన్ ట్యూటర్, ఇ-ఎడ్యుకేటర్ ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. వేతనాలు కూడా బాగానే ఉంటున్నాయి. ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగులు అప్‌లోడ్ చేసిన వివరాలను బట్టి భారతదేశంలో టీచర్ వార్షిక వేతనం సగటున రూ.2,19,804 నుంచి రూ.5,88,000 కావడం విశేషమని ఇండీడ్ వెల్లడించింది. ఇక ఆన్‌లైన్ ట్యూటర్ వార్షిక వేతనం రూ.4,80,000 నుంచి రూ.9,25,000 అయినట్టు ఇండీడ్ వెల్లడించింది.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి

Loading...
ఇవి కూడా చదవండి:

Exams: డిగ్రీ ఫెయిల్ అయ్యారా? పరీక్ష రాయడానికి మరో ఛాన్స్

Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే

Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...