Home /News /jobs /

INCOME TAX DEPARTMENT RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON FOR TAX ASSISTANT MULTI TASKING STAFF AND INSPECTOR OF INCOME TAX POSTS SS

Income Tax Jobs 2021: పరీక్ష లేకుండా ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్... రూ.1,42,000 వేతనం

Income Tax Jobs 2021: పరీక్ష లేకుండా ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్... రూ.1,42,000 వేతనం

Income Tax Jobs 2021: పరీక్ష లేకుండా ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్... రూ.1,42,000 వేతనం

Income Tax Department Recruitment 2021 | ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పలు ఖాళీలు భర్తీ చేస్తోంది. పరీక్ష లేకుండా ఉద్యోగం పొందొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

    భారత ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫుల్ టైమ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, కబడ్డీ, హాకీ, కరాటే లాంటి క్రీడల్లో రాణించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్స్ రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీ.



















    మొత్తం ఖాళీలు28
    ట్యాక్స్ అసిస్టెంట్13
    మల్టీ టాస్కింగ్ స్టాఫ్12
    ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్3

    Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా

    Income Tax Department Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 29

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 30

    విద్యార్హతలు- ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. గంటకు 8,000 పదాలు డేటా ఎంట్రీ చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి.

    వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు జనరల్, ఓబీసీ కేటగిరీలో 5 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలో 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

    ఎంపిక విధానం- దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత తదుపరి ప్రక్రియ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

    వేతనం- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.56,900, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు రూ.81,100, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది.

    UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    Income Tax Department Recruitment 2021: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు https://www.incometaxindia.gov.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో జాబ్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
    Step 2- జాబ్ నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
    Step 3- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
    Step 4- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
    Step 5- దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    Income Tax Officer (Hq)(Admn),
    O/o Principal Chief Commissioner of Income Tax,
    UP (East), Aayakar Bhawan,
    5-Ashok Marg,
    Lucknow-226001.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు