GST కౌన్సిల్ సమావేశంలో కొన్ని ఉత్పత్తులపై GST రేటును తగ్గించడం నుండి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మేలు చేకూరే అంశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ రేటు తగ్గించగా, రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాన్ మసాలా, గుట్కాపై జీఎస్టీపైనా చర్చ జరిగింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన పూర్తయింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే..
లెవీ పరిధి నుంచి మినహాయింపు..
అయితే ఈ జీఎస్టీ సమావేశంలోనే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు నిర్వహించే ఎన్టీఏ(National Testing Agency)ని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ ఈ కౌన్సిల్ సిఫారసు చేసింది. అంటే.. విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే సేవలకు GST మినహాయింపు ఇచ్చారు. దీంతో పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థులకు ఈ మినహాయింపుతో కాస్త ఊరట లభించనుంది. ఇప్పటికే వరకు చెల్లించే ఫీజులో 18 శాతం జీఎస్టీని విధించేవారు. తాజాగా ఈ ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడంతో.. విద్యార్థులకు మేలు చేకూరిందనే చెప్పాలి. వీటితో పాటు.. విద్యార్థులకు ఉపయోకరంగా ఉండే పెన్సిల్, షార్పనర్ లపై కూడా విధించే జీఎస్టీని తగ్గించారు. అంతకముందు 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించారు.
16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను ఐదేళ్లపాటు రాష్ట్రాలకు విడుదల చేసింది. రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద కోర్టులు మరియు ట్రిబ్యునల్‌లు అందించే సేవలపై పన్ను విధించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది. లిక్విడ్ బెల్లం (రాబ్)పై జీఎస్టీ రేటు 18 శాతం నుంచి శూన్యం లేదా 5 శాతానికి తగ్గించబడింది. లూజ్‌కి ఎలంగి పన్ను లేదు. ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేసిన కొనుగోళ్లకు 5 శాతం వరకు జీఎస్టీ ఉంటుంది. GST అప్పిలేట్ ట్రిబ్యునల్ భాషలో మార్పులను ఆమోదించింది. ముసాయిదాకు సవరణలు వచ్చే 5-6 రోజుల్లో విడుదల చేయబడతాయని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GST, GST Council, JOBS, Nirmala sitharaman