హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: హైదరాబాద్, వరంగల్ లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు ఇలా..

Telangana Jobs: హైదరాబాద్, వరంగల్ లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 20 చివరి తేదీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 20 చివరి తేదీ. దరఖాస్తు చేసుకోవడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిన్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, గార్డెనర్‌ తదితర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

అడ్మిన్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, గార్డెనర్‌ తదితరాలు.

అర్హతలు : పోస్టును అనుసరించి అభ్యర్థులు పదోతరగతి‌, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుతో పాటు.. దరఖాస్తు ఫారమ్, విద్యార్హత సర్టిఫికేట్లను ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహీంబాగ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సన్‌ సిటీ దగ్గర, హైదరాబాద్‌-500031 అడ్రస్ కు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 20. పూర్తి వివరాలకు వెబ్‌సైట్  https://www.apsgolconda.edu.in/ ను సందర్శించండి.

SSC CHSL Results: గుడ్ న్యూస్.. ఎస్సెస్సీ సీహెచ్ఎస్ఎల్ ఫలితాలు విడుదల..

మరో నోటిఫికేషన్ లో.. నిట్‌ వరంగల్‌లో పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో ఉద్యోగాలు..

పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ప్రకటన విడుదల చేసింది. దీన ద్వారా పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పీహెచ్‌డీ(అయానిక్ లిక్విడ్ సింథసిస్ అండ్‌ క్యారెక్టరైజేషన్/ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్‌ అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రాజెక్టు యొక్క వ్యవధి 2 సంవత్సరాలు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అడ్రస్ manohar@nitw.ac.in. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 20, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి విరాలకు వెబ్‌సైట్ https://www.nitw.ac.in/ను సందర్శించొచ్చు.

First published:

Tags: JOBS, Nit, Warangal

ఉత్తమ కథలు