Home /News /jobs /

IN SERVICE TRAINING BY AGNIVEERS TO BE RECOGNISED AS 50 PERCENTAGE CREDITS FOR GRADUATION DEGREE UMG GH

Agneepath Scheme: 'అగ్నివీర్స్'కు స్పెషల్ బెనిఫిట్స్.. స్కిల్-బేస్డ్ బ్యాచిలర్ డిగ్రీలో క్రెడిట్ పాయింట్లు

అగ్నివీర్లుగా ఎంపికైన వారికి ప్రత్యేక గుర్తింపు (Image Credit: Shutterstock/Representational)

అగ్నివీర్లుగా ఎంపికైన వారికి ప్రత్యేక గుర్తింపు (Image Credit: Shutterstock/Representational)

అగ్నిపథ్ స్కీమ్‌ (Agneepath Scheme) ద్వారా ఎంపికైన వారిని ‘అగ్నివీర్లు’ (Agniveers) గా పిలుస్తారు. శిక్షణ సమయంలో వీరికి క్రెడిట్‌ పాయింట్లు ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Union Education Minister) నిర్ణయించింది. ఇందు కోసం మూడు సంవత్సరాల స్కిల్-బేస్డ్ స్పెషల్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది.

ఇంకా చదవండి ...
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో నియామకాలు చేపట్టడానికి కొత్త పద్దతిని తీసుకొచ్చింది. అగ్నిపథ్ పేరుతో నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద ఎంపికైన వారికి సైనిక బలగాల్లో కొత్త ర్యాంకు ఇస్తూ..అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పాలసీని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్‌ ద్వారా ఎంపికైన వారిని ‘అగ్నివీర్లు’గా పిలుస్తారు. శిక్షణ సమయంలో వీరికి క్రెడిట్‌ పాయింట్లు ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందు కోసం మూడు సంవత్సరాల స్కిల్-బేస్డ్ స్పెషల్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ చేపట్టిన తరువాత ఈ శిక్షణ ప్రోగ్రామ్ ఉండనుంది. ఈ పథకం యువతను ‘అగ్నివీర్స్’గా ఏళ్ల తరబడి రక్షణ దళాల్లో సేవలందించేలా ఆకర్షిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

'అగ్నివీర్స్' శిక్షణ సమయంలో గ్రాడ్యుయేట్ డిగ్రీకి అవసరమైన 50 శాతం వరకు క్రెడిట్‌లను పొందుతారు. క్రెడిట్ ఆధారిత ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసిన ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీనే దీన్ని అమలు చేయనుంది. ఇందుకోసం త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, వైమానిక దళం ఇగ్నోతో అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు.. ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు..!


లాంగ్వేజ్‌లు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గణితం, ఎడ్యుకేషన్, కామర్స్, పర్యాటకం, ఒకేషన్ స్టడీస్, వ్యవసాయం, జ్యోతిష్ వంటి సబ్జెక్టుల్లో క్రిడెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ క్రెడిట్‌ల ద్వారా ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచే కోర్సులు చేయడానికి ఉపయోగపడతాయి.

ఇదీ చదవండి: 5G అంటే ఏంటి? ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలు పెరుగుతాయా? 5Gతో వచ్చే మార్పులు ఇవే..


ఈ ప్రోగ్రామ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ పాయింట్స్‌కు అవకాశం కల్పిస్తుంది. మొదటి-సంవత్సరం కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్‌ తీసుకుని ఎగ్జిట్ కావచ్చు. మొదటి, రెండో సంవత్సరాల కోర్సులను పూర్తి చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్, మూడేళ్ల కాల వ్యవధిలో అన్ని కోర్సులను పూర్తి చేసిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం రూపొందించిన ప్రేమ్‌వర్క్‌ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తించనున్నాయి. UGC నిబంధనల ప్రకారం.. (BA; B. Com.; BA (ఒకేషనల్ ); BA (టూరిజం మేనేజ్‌మెంట్)లో ఇగ్నో యూనివర్సిటీ డిగ్రీ ప్రదానం చేయనుంది.

ఇదీ చదవండి: రోడ్ ట్రిప్స్ ఎక్స్‌పీరియన్సే వేరబ్బా.. మీరూ ట్రావెల్ లవరైతే.. జీవితంలో ఒక్కసారైనా వీటిని చూడాల్సిందే..!


అగ్నివీర్‌కు ఎంపికైనవారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేస్తామని... 25 శాతం మందిని తాత్కాలికంగా సర్వీస్‌లో కొనసాగిస్తామని వెల్లడించారు. వీరికి ఏడాదికి రూ.11 లక్షల వేతనం ఉంటుందని, 15 ఏళ్ల సర్వీస్‌ అనంతరం పెన్షన్‌ సదుపాయం ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అగ్నివీర్‌ విభాగానికి కొత్త లోగో, కొత్త యూనిఫాం ఉంటుందని తెలిపారు. నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుందని, అలాగే రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో నాలుగేళ్ల సర్వీస్‌ ఉంటుందని, నాలుగేళ్ల సర్వీస్‌ అనంతరం అగ్నివీర్‌ సర్టిఫికేట్‌ అందజేస్తామన్నారు. అగ్నివీర్‌ సర్వీస్‌ తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని రాజ్‌నాథ్ వెల్లడించారు.
Published by:Mahesh
First published:

Tags: Army jobs, Government jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు