Jobs: రెండేళ్లలో 381,199 ఉద్యోగాలు... రైల్వేలోనే 98,999 పోస్టులు... కేంద్ర ప్రభుత్వం లెక్కలు

Jobs | 2017 మార్చి నాటికి రైల్వేలో 12.7 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 2019 మార్చిలో 13.69 లక్షల మంది ఉద్యోగులున్నారు.

news18-telugu
Updated: July 8, 2019, 5:25 PM IST
Jobs: రెండేళ్లలో 381,199 ఉద్యోగాలు... రైల్వేలోనే 98,999 పోస్టులు... కేంద్ర ప్రభుత్వం లెక్కలు
Jobs: రెండేళ్లలో 381,199 ఉద్యోగాలు... రైల్వేలోనే 98,999 పోస్టులు... కేంద్ర ప్రభుత్వం లెక్కలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 8, 2019, 5:25 PM IST
భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతున్నారన్న విమర్శలు ఓవైపు ఉన్నాయి. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 3.81 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టు బడ్జెట్ 2019-20 పత్రాల్లో వెల్లడించింది కేంద్రం. 2017 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 32,38,397 మంది పనిచేస్తుండగా, 2019 మార్చి 1 నాటికి 36,19,596 మంది ఉద్యోగులు ఉన్నారని శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత యువతకు ఉపాధి కరువైందంటూ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కానీ బడ్జెట్ పత్రాలు చూస్తే రెండేళ్లలో 381,199 ఉద్యోగాలు సృష్టించినట్టు లెక్కతేలింది. వాటిలో రైల్వే మంత్రిత్వ శాఖలో అత్యధికంగా 98,999 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్టు తేలింది. 2017 మార్చి నాటికి రైల్వేలో 12.7 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 2019 మార్చిలో 13.69 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది రైల్వేలో లక్షన్నరకు పైగా ఉద్యోగాల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక గత రెండేళ్లలో పోలీస్ ఫోర్స్‌లో 80,000, పరోక్ష పన్నుల విభాగంలో 53,000, ప్రత్యక్ష పన్నుల విభాగంలో 29,935, డిఫెన్స్‌లో 46,347 కొత్త ఉద్యోగాలు సృష్టించినట్టు లెక్కలు చెబుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలో సుమారు 10,000, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్‌లో 2,250, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్‌లో 3,981, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 7,743, గనుల శాఖలో 6,338, డిపార్ట్‌ ఆఫ్ స్పేస్‌లో 2,920, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల విభాగంలో 2,056, విదేశాంగ మంత్రిత్ర శాఖలో 1,833, సాంస్కృతిక శాఖలో 3,647, వ్యవసాయ శాఖలో 1,835, విమానయాన శాఖలో 1,189 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో




ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే
Loading...
Railway Jobs: రైల్వేలో స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు
First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...