ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమై ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అవుతున్న వారికి ఇవి కష్టమే. అయితే ఇటీవల కాలంలో వీటికి కూడా డిమాండ్ పెరిగిందని తాజా సర్వేలో తేలింది. ఐఐఎం కోజీకోడ్‌కు చెందిన విద్యార్థులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం...
పిల్లలకు చదువొక్కటే కాదు.. ఇతర కార్యకలాపాల్లోనూ ముందుండేలా చూడాలి. పాఠశాలల్లో అయితే ఆటలు, వ్యాసరచన, వకృత్త్వపు పోటీలు(డిబేటింగ్) పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశముంటుంది. ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమై ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అవుతున్న వారికి ఇవి కష్టమే. అయితే ఇటీవల కాలంలో వీటికి కూడా డిమాండ్ పెరిగిందని తాజా సర్వేలో తేలింది. ఐఐఎం కోజీకోడ్‌కు చెందిన విద్యార్థులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ ఏడాది భారత్‌లో ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్ దాదాపు రూ.42 వేల కోట్లకు(5.8 బిలయన్ డాలర్లు) చేరిందని పేర్కొంది.
ఎక్స్ట్రా కరిక్యూలర్ విద్యపై ఆసక్తి..
2025 నాటికి భారత జనాభాలో(140 కోట్లు) 80 శాతం మందికి ఇంటర్నెట్ వినియోగిస్తారని, ఇందులో 9.23 శాతం మంది ఎక్స్ ట్రా కరిక్యులర్ మార్కెట్లో భాగమవుతారని ఈ సర్వే తెలిపింది. దాదాపు 2280 కుటుంబాలపై సర్వే నిర్వహించగా.. ఇందులో 63 శాతం తల్లిదండ్రుల సగటు ఆదాయం 6 లక్షల కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. వీరు తమ పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఎక్స్ట్రా కరిక్యులర్ విభాగం కింద సగటున నెలకు రూ.850లు ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేసింది. తాము వినియోగించని ఆదాయంలో 3 నుంచి 4 శాతం పిల్లల చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం ఎడ్యుకేషన్ కింద పెట్టుబడి పెడుతున్నారని తెలిపింది.
తక్కువ ఆదాయం కలిగిన తల్లిదండ్రులు ఆన్లైన్ ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో దాదాపు 1.24 బిలయన్ డాలర్లు అందిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఏడాదికి 6 నుంచి 10 లక్షల మధ్య ఆదాయమున్న తల్లిదండ్రులు 23 శాతం ఉన్నారని, వారు 2.27 బిలియన్ డాలర్లు ఇస్తున్నారని తెలిపింది. 10 లక్షలకు పైగా ఆదాయం కలిగిన తల్లిదండ్రుల్లో 14 శాతం మంది ఉండగా.. వీరు తమ వాటాగా 2.33 బిలియన్ డాలర్లు అందిస్తున్నారని సర్వేలో తేలింది.
మార్కెట్ వృద్ధికి కారణమిదే..
టైర్-1, 2, 3 నగరాలతో పాటు ఇతర పట్టణాల్లో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం అధికంగా ఉండటం వల్ల ఎక్స్ట్రా కరిక్యూలం మార్కెట్ వృద్ధికి దారితీస్తుంది. సర్వే ఫలితాల ప్రకారం భారత విద్యార్థుల్లో కో-కరిక్యులం విద్యలో డిబేటింగ్కు 36 శాతం, 28 శాతం సైన్స్ క్లబ్, 22 శాతం బుక్ క్లబ్ కోసం పాపులారిటీ పెరుగుతుంది. 80 శాతం మంది తల్లిదండ్రులు విజువల్ ఆర్ట్స్‌తో పాటు పిల్లలకు ఇష్టమైన రంగాల్లో ఆసక్తి ఆధారంగా మొగ్గు చూపారు. 76 శాతం తల్లిదండ్రులు డ్యాన్స్, మ్యూజిక్ లాంటి కళలకు ప్రతిస్పందించారు. 30 శాతం మంది తల్లిదండ్రులు తమకిష్టమైన రంగాల్లో, 3 శాతం మంది ఈసీఏ విభాగాలను ఎంచుకోవాలని అనుకున్నారు.