హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Education: ఐఐటీలో ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్‌లు.. చదవొచ్చు

IIT Education: ఐఐటీలో ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్‌లు.. చదవొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ అంటే కేవ‌లం సాంకేతికి విద్య చ‌దివే వారికే అనే అభిప్రాయం మనకు ఉంది. కానీ ఐఐటీలో వేరే కోర్సులు కూడా చేయొచ్చు. పలు ఐఐటీలు డిజైన్, మేనేజ్‌మెంట్, ఆర్ట్స్ సబ్జెక్టుల(Subjects)లో కోర్సులను అందిస్తున్నాయి. అందులో ఎలా చేరాలో తెలుసుుకోండి.

ఇంకా చదవండి ...

ఐఐటీలో చేరడం అనేది ఇంజ‌నీరింగ్(Engineering) చ‌ద‌వాల‌నుకొనే ప్ర‌తీ భార‌తీయ విద్యార్థి క‌ల. చాలా మంది అందుకోసం నిరంత‌రం శ్ర‌మిస్తారు. కేవ‌లం సాంకేతికి విద్య చ‌దివే వారికే ఐఐటీలో ప్ర‌వేశాల‌కు అవ‌కాశం ఉంటే వేరే కోర్సులు చేరే వారికి ఐఐటీ(IIT)లో చేర‌డం అసాధ్యం అనే అభిప్రాయం అంద‌రిలో ఉంది. అయితే సాంకేతిక విద్య మాత్ర‌మే కాకుండా.. డిజైన్, మేనేజ్‌మెంట్ మరియు ఇతర సబ్జెక్టుల(Subjects)లో కోర్సులను ఐఐటీ అందించ‌నుంది.  ఈ నేప‌థ్యంలో సాంకేతిక కోర్సులే కాకుండా.. ఐఐటీ అందించే ఇత‌ర కోర్సుల వివ‌రాలు ఎంటో తెలుసుకొందాం.  కోర్సుల వివరాలే కాకుండా ఈ కోర్సుల్లో చేరేందుకు  ఏం చేయాలో తెలసుకుందాం.

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des)

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (Bachelor of Design) అనేది డిజైన్ సూత్రాలు, చిత్రాలు మరియు ఫోటోగ్రఫీని బోధించే నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (UCEED) ద్వారా అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. జాతీయ స్థాయి(National level) ప్రవేశ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది. విద్యార్థికి ఈ కోర్సులో విజువలైజేషన్(Visualization), డిజైన్(Desing) ఆలోచన, సమస్య పరిష్కారం, పరిశీలన, భాష సామ‌ర్థ్యం, పర్యావరణ - సామాజిక అవగాహన వంటి విషయాలను నేర్పిస్తారు. ప్రస్తుతం ఈ కోర్సు ఐఐటీ బాంబే (37 సీట్లు), ఐఐటీ హైదరాబాద్ (20 సీట్లు) మరియు ఐఐటి గౌహతి (56 సీట్లు) అందిస్తున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఐఐటీ ఢిల్లి కూడా ఈ కోర్సు(Course)ను ప్ర‌వేశ‌పెడుతుంది. ఇవే కాక అదనంగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, జబల్‌పూర్ (66 సీట్లు) కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.

అర్హ‌త‌లు :- 12 వ తరగతి పూర్తి చేసి, 24 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ కోర్సులో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలో పాల్గొనవచ్చు.

RRC Recruitment 2021: రైల్వేలో 3093 అప్రెంటీస్ పోస్టులు..


మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des)

మాస్టర్ ఆఫ్ డిజైన్(Master of Design) అనేది రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు, డిజైన్ కోర్సులలో స్పెషలైజేషన్ చేస్తారు.ఈ కోర్సును హ్యుమానిటీస్ మరియు కామర్స్(Commerce) నేపథ్యాలు కలిగిన విద్యార్థులు కూడా తీసుకోవచ్చు. ఆసక్తి గల దరఖాస్తుదారులు తమ డిజైన్ కోర్సులలో CEED ద్వారా IIT లో ఈ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుతం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, జబల్‌పూర్‌కి అదనంగా ఆరు ఐఐటీలు ఉన్నాయి. ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీ(Delhi), ఐఐటి గౌహతి మరియు ఐఐటి కాన్పూర్‌లో ఈ కోర్సు అందించబడుతుంది.

అర్హ‌త‌లు :- కనీసం మూడు సంవత్సరాలు డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసిన ఎవరైనా అభ్యర్థులు కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేజీలు వారు ఎంచుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ ప్రకారం ఈ ప్రోగ్రాం స్పెషలైజేషన్‌ని పేర్కొనవచ్చు. అదనంగా, GD ఆర్ట్స్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా CEED పరీక్షకు అర్హులు.

BPCL Recruitment 2021: బీపీసీఎల్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌


MA స్పెషలైజేషన్

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(Master of Arts) ఇది రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ భాష,  రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం, భూగోళశాస్త్రం, తత్వశాస్త్రం ఇత‌ర అంశాల‌తో కోర్సును అందిస్తారు. ఈ కోర్సుల సబ్జెక్టులు అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం, కేవలం మూడు ఐఐటిలు ఉన్నాయి - ఐఐటి గాంధీనగర్, ఐఐటి మద్రాస్(Madras) మరియు ఐఐటి గౌహతి, ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుకు ప్ర‌తీ ఐఐటీ స్వ‌తంత్రంగా ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది. దాని ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

అర్హతలు :- ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆయా ఐఐటీలు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న అర్హ‌త‌లు క‌లిగి ఉండాలి.

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (Master of Business Administration):

ఐఐటీలో ఎంబీఏ చేసే అవ‌కాశం కూడా ఉంది. CAT లో అభ్యర్థి స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూల రౌండ్ల ఆధారంగా ఐఐటీలో ఈ కోర్సులకు ప్రవేశం ల‌భిస్తుంది. ప్రస్తుతం, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు ఎనిమిది ఐఐటిల ఉంది. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీ, ఐఐటి కాన్పూర్(Kanpur), ఐఐటి ధన్‌బాద్, ఐఐటి ఖరగ్‌పూర్ మరియు ఐఐటి జోధ్‌పూర్‌లో ఈ కోర్సును అందిస్తున్నాయి.

First published:

Tags: Bba course, EDUCATION, IIT, IIT Bombay, IIT Hyderabad, IIT Madras

ఉత్తమ కథలు