హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: జేఎల్ పోస్టులతో పాటు.. 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టులు..

TSPSC Notification: జేఎల్ పోస్టులతో పాటు.. 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు.. ఇంటర్‌ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగా.. వీటికి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక జేఎల్ పోస్టుల విషయానికి వస్తే..   ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా డిసెంబర్ 16, 2022 నుంచి జనవరి 06, 2023 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేస్తారు.

సబ్జెక్టుల వారీగా జేఎల్ పోస్టుల వివరాలిలా..

అరబిక్ - 02, బోటనీ - 113, బోటనీ (ఉర్దూ మీడియం)-15 , కెమిస్ట్రీ - 113, కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19, సివిక్స్ - 56, సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16, సివిక్స్ (మారాఠీ) - 01, కామర్స్ - 50, కామర్స్ (ఉర్దూ మీడియం) - 07, ఎకనామిక్స్ - 81, ఎకనామిక్స్ (ఉర్దూ) - 15, ఇంగ్లీష్ - 81, ఫ్రెంచ్ - 02, హిందీ - 117, హిస్టరీ- 77, హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17, హిస్టరీ (మరీఠీ మీడియం) - 01, మ్యాథ్స్ - 154, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09, ఫిజిక్స్ - 112, ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18, సాంస్క్రీట్(Sanskrit) - 10, తెలుగు - 60, ఉర్దూ - 28, జువాలజీ - 128, జువాలజీ (ఉర్దూ మీడియం) - 18 వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి.

Panchayat Secretary Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 2560 పంచాయతీ సెక్రటరీ పోస్టులు..

ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల నుంచి టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొన్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి 247 పోస్టులకు నోటిఫికేషన్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

TSPSC Junior Lecturer Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TSPSC నుంచి జేఎల్(JL) నోటిఫికేషన్ జారీ..

ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ నెల 14 నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నిన్న 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇలా వరుస నోటిఫికేషన్లతో తెలంగాణలోని నిరుద్యోగుల్లో ఆనందకోలాహలం కనపడుతోంంది.

First published:

Tags: JOBS, TSPSC, Tspsc jobs