హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IMSc Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.15వేలు పొందొచ్చు..

IMSc Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.15వేలు పొందొచ్చు..

IMSc Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.15వేలు పొందొచ్చు..

IMSc Recruitment 2022: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నెలకు రూ.15వేలు పొందొచ్చు..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ చెన్నైలో(IMSc Chennai) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ చెన్నైలో(IMSc Chennai) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. మొత్తం 12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ, లైబ్రరీ ట్రైనీ, రీసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్ పోస్టుల (Administrative Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.

అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ ఖాళీలు 3, లైబ్రరీ ట్రైనీ ఖాళీలు 2, రీసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీలు 4, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఖాళీలు 2, జేఆర్‌ఎఫ్ ఖాళీలు 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి వివిధ విభాగాలకు విద్యార్హతలు ఉన్నాయి.

Police Jobs 2022: 12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..

ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే గడిచిన మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. అంటే 2020, 2021, 2022లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Work From Home End Card: వర్క్ ఫ్రం హోంకు శుభం కార్డు.. ప్రకటించిన ప్రముఖ ఐటీ దిగ్గజం..

దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. పై అర్హతలు కలిగిన వారు అక్టోబర్ 5, 2022లోగా దరఖాస్తులను admntrainee@imsc.res.in లేదా librarytrainee@imsc.res.in కు సాఫ్ట కాపీలను పంపించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను https://www.imsc.res.in/ వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు.

TSPSC New Notification: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత వివరాలిలా.. 

జేఆర్ఎఫ్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కెమిస్ట్రీ లేదా మ్యాథమేటిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నెలకు జీతం రూ.21 వేల నుంచి 31 వేల మధ్య చెల్లిస్తారు. రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు.. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్ డీ పూర్తి చేసి ఉండాలి. జీతం నెలకు రూ.44 వేల నుంచి రూ. 65, 500 వరకు చెల్లిస్తారు. పూర్తి సమాచారం కొరకు ఈ లింక్ పై  https://www.imsc.res.in/~office/jobs/Advt06trainee.pdf క్లిక్ చేసి పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Jrf

ఉత్తమ కథలు