Study Tips for CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్.. మంచి ఫలితాలు పొందాలంటే ఈ టిప్స్ పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

సిలబస్ సరిగా పూర్తి కాకపోవడం, ఆన్లైన్ క్లాసులు అస్తవ్యస్తంగా సాగడంతో సీబీఎస్ఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొన్ని టిప్స్..

  • Share this:
    కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరమంతా గందరగోళంగా సాగుతోంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంవత్సరం వృథా కానివ్వొద్దన్న లక్ష్యంతో అధికారులు, ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటించాయి. సీబీఎస్ఈ సైతం పరీక్షల తేదీలను ప్రకటించింది. సిలబస్ సరిగా పూర్తి కాకపోవడం, ఆన్లైన్ క్లాసులు అస్తవ్యస్తంగా సాగడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొన్ని టిప్స్..

    తగ్గించిన సిలబస్ పై అవగాహన: కరోనా నేపథ్యంలో సిలబస్ ను ఈ సారి ప్రభుత్వం తగ్గించింది. విద్యార్థులు ఈ అంశంపై పూర్తి అవగాహన పెంపొందించకోవడం అవసరం. తగ్గించిన సిలబస్ ఏంటి? ఎంత వరకు చదువుకుంటే సరిపోతుంది అన్న విషయాలను తెలుసుకుంటే పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించవచ్చు. లేక పోతే సమయం వృథా అయ్యి ఆ ఎఫెక్ట్ పరీక్షలపై పడుతుంది.
    పరీక్షా పత్రంపై అవగాహన: విద్యార్థులు పరీక్షా పత్రంపై అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇందు కోసం ప్రాక్టీస్ పేపర్లను చూడాలి.

    ప్లానింగ్ తో ప్రిపరేషన్: కరోనా ఎఫెక్ట్ తో విద్యార్థులు ఇళ్ల నుంచే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు పాఠశాలతో పోల్చితే యాక్టీవ్ గా ఉండే అవకాశం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో విద్యార్థులు అలర్ట్ అయ్యి.. పక్కాగా టైం టేబుల్ రూపొందించుకుని ప్రిపేర్ అవడం మంచిది.

    Good Workspace: కరోనా ఎఫెక్ట్ తో అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులంతా స్టడీ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో బెడ్ పై ఉండి చదువుకోవడం చేస్తున్నారు. అయితే.. బెడ్ పై నుంచి చదువుకోవడం కంఫర్ట్ గా ఉంటుందని భావిస్తున్నా.. అలా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫిజికల్ క్లాస్ రూం మాదిరిగానే సెటప్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

    రివిజన్ కోసం సమయం: గత సంవత్సరపు ప్రశ్నపత్రాలలో కనిపించే ముఖ్య అంశాలు మరియు సాధారణ ప్రశ్నలను రివిజన్ చేయడం అవసరం. మిగతా ప్రశ్నలను కూడా మరో సారి రివిజన్ చేయడం మంచింది.

    సాధారణ తప్పులను గుర్తించడం: దాదాపు విద్యార్థులంతా ఏదో ఓ మిస్టేక్ చేస్తుంటారు. దీంతో ప్రతీ విద్యార్థులు తాము సాధారణంగా చేసే తప్పులను గుర్తించుకుని సవరించుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు.

    ప్రశ్నలను అర్థం చేసుకోవడం ముఖ్యం: విద్యార్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడం ముఖ్యం. మాథ్స్ లాంటి ప్రశ్న పత్రాల్లో అర్థం కాని ప్రశ్నలు అధికంగా ఉంటాయి. పాత ప్రశ్న పత్రాలను గమనించడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు.

    టైం మేనేజ్మెంట్: పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో కేటాయించిన సమయంలో జవాబులను అంతే సమయంలో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. పాత ప్రశ్నపత్రాలతో ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు ఇలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: