Home /News /jobs /

IMPORTANT ANNOUNCEMENT FOR RRB GROUP D CANDIDATES KNOW THE EXAM DATE CENTER DETAILS AS MENTIONED HERE VB

RRB Group D Admit Cards: రైల్వే గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్.. మీ పరీక్ష తేదీ, సిటీ వివరాలను తెలుసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D). ఎట్ట‌కేల‌కు ఇటీవల రైల్వే బోర్డు ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుద‌ల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D). ఎట్ట‌కేల‌కు ఇటీవల రైల్వే బోర్డు(Railway Board) ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్(Exam Date) విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఆర్ఆర్బీ గ్రూప్ డీ మొదటి ఫేస్ లో ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే(Eastern Central Railway), వెస్ట్రన్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) బోర్టులకు గ్రూప్ డీ పరీక్షల షెడ్యూల్ ను ఇటీవల విడుదల చేసింది. దీనికి సంబంధించి నోటీస్(Notice) ను కూడా ఆయా బోర్టు వెబ్ సైట్లలో పొందుపరిచింది. అయితే తాజాగా అభ్యర్థుల యొక్క పరీక్ష తేదీ, పరీక్ష సెంటర్ వివరాలను వెబ్ సైట్లో ఉంచారు.

దీనికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అయితే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 17న పరీక్ష ఉన్నవాళ్లు ఈ నెల 13వ తారీఖును హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇలా పరీక్షకు 4 రోజుల ముందు హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని నోటీస్ లో పేర్కొన్నారు.

సెంటర్ వివరాలను ఇలా తెలుసుకోండి..

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2: వెబ్ పేజీలో  ఎడమ వైపు  కనిపిస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : Click Here for Exam, City Slip for CBT Phase-1 ఆప్షన్ ను ఎంచుకొని రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.

ప‌రీక్ష విధానం..

ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష వంద మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ప‌రీక్ష‌లో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబ‌ట్టి వేగం క‌చ్చిత‌త్వం చాలా అవ‌స‌రం.

సిల‌బ‌స్ వివ‌రాలు..
మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్ల‌మ్‌లు ఉంటాయి.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.

కరెంట్ అఫైర్స్ - ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల అధినేత‌లు, ఇటీవ‌ల అవార్డులు పొందిన వారి వివ‌రాలు వ‌చ్చి ఉండాలి.

జనరల్ అవేర్‌నెస్ - ప‌దో త‌ర‌గ‌తి వ‌రుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్ర‌స్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చ‌ద‌వాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Indian Railway, JOBS, Railway jobs, Rrb group d

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు