• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IMD RECRUITMENT 2021 INDIA METEOROLOGICAL DEPARTMENT IMD HAS INVITED APPLICATIONS FOR THE SCIENTIST C D AND E POSTS NS

IMD Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

IMD Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్ (IMD) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    నిరుద్యోగులకు ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్ (IMD) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ
    నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కంది. సైంటిస్ట్ ఈ, సైంటిస్ట్ డీ, సైంటిస్ట్ సీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన అనంతరం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Scientist ‘E’: ఈ విభాగంలో మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, Meteorology, Atmospheric Science/Atmospheric Physics, Oceanography, Geophysics, Remote Sensing తదితర సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఫిబ్రవరి 22 నాటికి 50 ఏళ్ల వయస్సు ఉండాలి.

    Scientist ‘D’: ఈ విభాగంలో 29 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, Meteorology, Atmospheric Science, Atmospheric Physics, Oceanography, Geophysics, Remote Sensing సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 నాటికి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.

    Scientist ‘C’: ఈ విభాగంలో 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, Meteorology, Atmospheric Science, Atmospheric Physics, Oceanography, Geophysics (with Meteorology), Remote Sensing తదితర సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫిబ్రవరి 22 నాటికి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోగా అన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    Official Website
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు