దేశంలోని ఐఐటీల్లో 2022-23 అకడమిక్ ఇయర్ ప్లేస్‌మెంట్స్(Placements) ప్రారంభమయ్యాయి. ఐఐటియన్స్ ప్లేస్‌మెంట్స్‌లో కోట్లు కొల్లగొడుతున్నారు. టాప్ కంపెనీలు అత్యుత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు కళ్లు చెదిరే ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.తాజాగా ఐఐటీ కాన్పూర్‌కు(IIT Kanpur) చెందిన ఓ విద్యార్థికి ఏకంగా రూ.4 కోట్ల ప్యాకేజీని జేన్ స్ట్రీట్ క్యాపిల్ అనే ట్రేడింగ్ సంస్థ ఆఫర్ చేసింది.ప్రధానంగా స్క్వేర్‌పాయింట్, టిబ్రా, క్వాడే, గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్, JPMC క్వాంట్, మావెరిక్ డెరివేటివ్స్ అండ్ డా విన్సీ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్ కోసం ఐఐటీలను విజిట్ చేస్తున్నాయి.
* మార్కెట్ అనలైజింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యం
హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT), క్వాంట్ కంపెనీలు.. గణితం, స్టాటిస్టికల్ మోడల్స్ ఉపయోగించి మార్కెట్ పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఒకపక్క ఆర్థిక మాంద్యం హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ కంపెనీలు రూ.కోట్ల ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ ఐఐటీల విద్యార్థులకు కొలువులు ఆఫర్ చేస్తుండటం గమనార్హం.
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్-2023 షెడ్యూల్ విడుదల.. ప్రధాన పరీక్షల తేదీలు ఇవే..
* హెచ్ఎఫ్టీ సంస్థల భారీ ఆఫర్స్
హెచ్ఎఫ్టీ సంస్థలు.. హోమ్ పోస్టింగ్స్ కోసం రూ.1.3 కోట్ల నుంచి రూ.1.4 కోట్ల వరకు ఆఫర్ చేశాయి. ఇక అంతర్జాతీయ పోస్టింగ్ కోసం రూ.1.6 కోట్ల నుంచి రూ.2.4 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమని చెబుతున్నాయి. ఈ జీతాలు రూ.80 లక్షల బోనస్‌తో ఉంటాయి. అయితే గత రెండేళ్లలో రిక్రూట్మెంట్స్ 100 శాతం కంటే ఎక్కువ బోనస్‌లను పొందడం గమనార్హం. క్వాంట్‌బాక్స్ రీసెర్చ్ కంపెనీ ఈ సంవత్సరం 10-15 మంది విద్యార్థులను ఈ స్థాయి వేతనాలతో రిక్రూట్ చేసుకుంది.
మావెరిక్ డెరివేటివ్స్ అండ్ డా విన్సీ కంపెనీ 150,000 అమెరికన్ డాలర్ల ప్యాకేజీ డీల్‌ను కుదుర్చుకుందని IIT-కాన్పూర్ ప్లేస్మెంట్ టీమ్‌కు చెందిన ఓ సభ్యుడు తెలిపారు. సెక్యూరిటీ సంస్థలు కోహెసిటీ, రుబ్రిక్, వాణిజ్య సంస్థ ఆప్టివర్ ఐఐటీ మద్రాస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్నాయి. ఇవి రూ.కోటికి పైగా ప్యాకేజీని ఆఫర్ చేశాయి. ఐఐటీ మద్రాస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్స్టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ 14 మందిని, బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్, చేతక్ టెక్నాలజీ లిమిటెడ్ 10 మందిని, క్వాల్కామ్ 8 మందికి అవకాశాలు ఇచ్చాయి. JP మోర్గాన్ చేజ్ అండ్ కో 9 మంది విద్యార్థులకు ఆఫర్స్‌ను అందజేశాయి.
ఐఐటీ-గౌహతి విద్యార్థికి రూ.2.4 కోట్ల పే ప్యాకేజీ
ఐఐటీ-గౌహతి విద్యార్థులకు ఒరాకిల్ ఏకంగా 11 ఆఫర్లను అందించింది. ఇందులో ఒక విద్యార్థికి గ్లోబల్ పోస్టింగ్ కోసం ఏకంగా రూ.2.4 కోట్ల పే ప్యాకేజీని అందించింది. మరొకరిని దేశీయ పోస్టింగ్ కోసం రూ.1.1 కోట్ల ప్యాకేజీతో తీసుకుంది. ఐఐటీ -రూర్కీకి చెందిన ఓ విద్యార్థి రూ.1.06 కోట్ల ప్యాకేజీని అందుకున్నాడు. ప్రధానంగా యాప్‌డైనమిక్స్, బజాజ్ ఆటో, బీసీజీ, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్, డావిన్సీ డెరివేటివ్స్, ఫ్లిప్‌కార్ట్ , గ్రావిటన్, ఇంటెల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది.
* ఫ్లిప్‌కార్ట్ రిక్రూట్మెంట్
స్టార్టప్స్ అండ్ ఇ-కామర్స్ కార్పొరేషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ రూ.26 లక్షల నుంచి రూ.33 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ప్రధానంగా నాలెడ్జ్ సైన్స్ అండ్ ప్రొడక్ట్ సూపర్వైజర్ రోల్స్ కోసం కంపెనీ రిక్రూట్ చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.