Scholarshipఈ రోజుల్లో అనుభవంతో పాటు స్కాలర్షిప్లు అందించే పెయిడ్ ఇంటర్నషిప్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే తాజాగా లడఖ్‌లోని విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ (Paid Internships)లతో పాటు స్పాన్సర్డ్ ఎంటెక్ డిగ్రీని ఆఫర్ చేస్తున్నట్లు యూటీ (Union Territory) అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. లడఖ్‌లోని విద్యార్థులకు (Students) మెరుగైన అవకాశాలను అందించడానికి ఢిల్లీ, బాంబే, కాన్పూర్‌లోని ఐఐటీలతో యూటీ అడ్మినిస్ట్రేషన్ ఇటీవలే ఒప్పందం చేసుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టులలో అండర్ గ్రాడ్యుయేట్-లెవెల్ కోర్సు చదువుతున్న లడఖ్ విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2022. ఆసక్తిగల విద్యార్థులు https://academics.iitd.ac.in/srfp/ లింక్ విజిట్ చేయవచ్చు.
షార్ట్-టర్మ్ ఇంటర్న్‌షిప్‌లకు సెలెక్ట్ అయిన విద్యార్థులు రూ.15,000, లాంగ్-టర్మ్ ఇంటర్న్‌షిప్‌లకు సెలెక్ట్ అయిన వారు రూ. 50,000 స్కాలర్షిప్లు అందుకుంటారు. యూటీ అడ్మినిస్ట్రేషన్స్ స్పాన్సర్డ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లకు సెలెక్ట్ అయిన విద్యార్థులు నెలకు రూ.25,000 స్కాలర్షిప్ పొందుతారు. విద్యార్థులు 1.5 నుంచి 2 నెలల వ్యవధిలో షార్ట్-టర్మ్ ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేయవచ్చు. ఆరు నెలల వ్యవధిలో లాంగ్-టర్మ్ ఇంటర్న్‌షిప్‌లు ముగుస్తాయి. విద్యార్థులు రెండేళ్ల స్పాన్సర్డ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఢిల్లీ, బాంబే, కాన్పూర్‌లోని ఐఐటీలలో షార్ట్-టర్మ్ ఇంటర్న్‌షిప్ కోసం మొత్తం 30 సీట్లు, లాంగ్-టర్మ్ ఇంటర్న్‌షిప్ కోసం 15 సీట్లు, ఎంటెక్ ప్రోగ్రామ్‌ల కోసం 12 సీట్లు అందుబాటులో ఉంటాయి.
ఐఐటీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రస్తుతం లడఖ్‌లోని ఏదైనా కాలేజీలో స్టెమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లడఖ్‌లోని ఏదైనా కాలేజీ లేదా పాలిటెక్నిక్‌లో స్టెమ్‌లో ఇప్పటికే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. అలానే దేశంలో ఎక్కడైనా సరే స్టెమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు లడఖ్‌లో శాశ్వత నివాసి అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టెమ్‌లో ఏ ప్రాంతంలోనైనా సరే డిప్లొమా పూర్తి చేసినవారు లడఖ్ శాశ్వత నివాసుల కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న విద్యార్థులు https://academics.iitd.ac.in/srfp/register.php ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రొసీజర్
షార్ట్-టర్మ్ ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులను వారి అప్లికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. లాంగ్-టర్మ్ ఇంటర్న్‌షిప్, ఎంటెక్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో సెలెక్ట్ కావాలంటే విద్యార్థులు ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాస్ కావాల్సి ఉంటుంది. అలాగే వారి అప్లికేషన్ కూడా అధికారులు చెక్ చేస్తారు. కాగా లడఖ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ యూనియన్ టెరిటరీలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఐఐటీ ఢిల్లీలోని డీన్ అకడమిక్స్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శంతను రాయ్ ఇంటర్న్‌షిప్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. “లడఖ్‌లోని విద్యార్థులలో స్టెమ్ సబ్జెక్టులలో ఆసక్తితో పాటు అవకాశాలను పెంపొందించడానికి మూడు ఐఐటీలకు చెందిన సహోద్యోగులు చేతులు కలిపారు. ఐఐటీల ఈ జాయింట్ ఎఫర్ట్ స్టెమ్ సబ్జెక్టుల్లో యూటీలోని విద్యార్థులను మెరుగుపరచడంలో సహాయపడుతుందని మేం ఆశిస్తున్నాం" అని అన్నారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.