క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఐఐటీ మద్రాస్ రికార్డు సృష్టిస్తోంది. గత రికార్డులన్నీ తిరగరాస్తూ పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. 2018-19 ఏడాదికి గానూ మొత్తం 1300 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్కు దరఖాస్తు చేసుకోగా 964 మందిని కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాయి. అందులో 97 మందికి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు దక్కాయి. గత ఏడాది 834 మంది ప్లేస్ అవ్వగా, ఈ ఏడాది 15 శాతం ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం విశేషం. మైక్రాన్ 26, ఇంటెల్ ఇండియా 26, సిటీబ్యాంక్ 23, మైక్రోసాఫ్ట్ 22, క్వాల్కామ్ 21 మందికి జాబ్ ఆఫర్ చేశాయి. అదీకాక, 51 స్టార్టప్ కంపెనీలు రిక్రూట్మెంట్లో పాల్గొనగా 121 మందిని ఎంపిక చేసుకోగా, అందులో 97 మంది ఆ ఆఫర్ను అంగీకరించారు.
గత ఏడాది డిసెంబరు 1-8లో తొలి దశ, ఈ ఏడాది రెండో దశ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగ్గా.. స్టార్టప్ రిక్రూట్మెంట్లలో ఐటీది 21 శాతం వాటా. అనలైటిక్స్ 16 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.