Home /News /jobs /

IIT SEATS A STUDENT OF JAGITYALA WHO HAS SECURED A SEAT IN SIX IITS KNR EVK

IIT Seats: ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీట్లు.. స‌త్తా చాటిన జగిత్యాల యువకుడు.

ఐఐటీలో సీట్ సాధించిన యువకుడు

ఐఐటీలో సీట్ సాధించిన యువకుడు

IIT | పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు. జగిత్యాల జిల్లా. ధర్మపురి కి చెందిన ఆదిత్య.. అనే యువకుడు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఆరు ఐఐటీల్లో సిటు సంపాదించాడు.

    (Srinivas, Karimnagar, News18)

    పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు. జగిత్యాల జిల్లా. ధర్మపురి కి చెందిన ఆదిత్య.. అనే యువకుడు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఆరు ఐఐటీల్లో సిటు సంపాదించాడు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న ఈ యువకుడు జాతీయస్థాయి పరీక్షల్లో తన ప్రతిభను చూపించాడు .ఐఐటీలో సీటు రావడం మాములు విషయం కాదు . ఎంతో కఠోర శ్రమ, పట్టుదల  ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు . ప్రతిష్టాత్మక జాతీయ అలాంటి సంస్థల్లో అవలీలగా  ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన ఆదిత్య గేట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా స్థాయిలో 24 వ ర్యాంకు సాధించి మొదటి విడతలోనే ఆరు ఐఐటీల్లో సీటు సంపాదించాడు . చదువులో మొదటి నుంచి ముందు వరుసలో ఉండే అదిత్య ఎస్ఎస్సి కరీంనగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి కంప్లీట్ చేశాడు . ఆ తర్వాత ట్రినిటీ కాలేజీలో ఇంటర్ టాపర్ గా నిలిచి ఎంసెట్లో మొదటి  ర్యాంకు ద్వారా హన్మకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (Indian Institute of Technology) లో  బీటెక్ సీటు సంపాదించాడు .

    ఆ తరువాత గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కర్ణాటక (Karnataka) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంటెక్ సీటు సంపాదించాడు . తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి టీసీఎస్ కి ఎంపికయ్యాడు . మరికొద్ది రోజులకే మరోసారి జూనియర్ టెలికం ఆఫీసర్ హోదాలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగానికి  ఎంపికై కేరళలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు . బీఎస్ఎన్ఎల్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా చదువు కొనసాగించాలని ఆదిత్య తన నిర్ణయించుకున్నాడు . అటు ఉద్యోగం చేస్తూనే ఇటు గేట్ పరీక్షకి ప్రిపేర్ అయి మళ్లీ పరీక్ష రాశాడు .

    ఈసారి ఏకకాలంలో 6 ఐఐటీల్లో మొదటి విడతలోనే సీటు లభించింది . దిల్లీ , ముంబయి , రూర్కీ , మద్రాస్ , గౌహతి , ఖరగ్పూర్ లలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీల్లో అడ్మిషన్ సాధించిన ఆదిత్య సక్సెస్ నిజంగా వండర్ అని చెప్పవచ్చు .ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తన లక్ష్యంగా చెబుతున్న ఆదిత్య ఇప్పటికే ఆ పరీక్ష కోసం పూర్తి యిలో ప్రిపేర్ అయి అందులోనూ ప్రిలిమ్స్ పూర్తి చేయడమే కాకుండా మెయిన్ పరీక్ష కూడా సెలెక్ట్ అయ్యాడు . దిల్లీ ఐఐటీలోని కంట్రోల్ అండ్ ఆటోమేషన్ తో పాటు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రెండు విభాగాల్లోనూ ఆదిత్యకు అవకాశ దక్కింది .

    అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూర ఇండియన్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు ఆదిత్య . దీనికి సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది . వరస విజయాలు సాధిస్తున్న ఆదిత్య పట్టుదల పట్ల స్థానిక ధర్మపురి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . గతంలో కూడా పెద్దపల్లి జిల్లా, రామగుండం చెందిన ధనుంజయ్ అనే యువకుడు కూడా ఒకేసారి 8 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నరు.వీళ్ళ పట్టుదల కృషి వెనుక వీళ్ళ తల్లిండ్రులు కష్టం ఎంతగానో ఉందని.. ఆదిత్య. ధనుంజయ్ అంటున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, EDUCATION, IIT

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు