ఐఐటీలో చదవాలన్న మీ కల నెరవేర్చుకోలేకపోయారా? అయితే ఐఐటీలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూపార్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. నాన్ ఐఐటియన్ల కోసం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. బయో మెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, హ్యుమానిటీస్ లాంటి సబ్జెక్ట్స్‌కు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 86 ఖాళీలున్నాయి. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 ఏప్రిల్ 16 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2021 మే 17 నుంచి జూలై 12 వరకు వర్చువల్ మోడ్‌లో ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iitrpr.ac.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
IIT Summer Internship: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 16
ఇంటర్న్‌షిప్ ప్రారంభం- 2021 మే 17
ఇంటర్న్‌షిప్ పూర్తి- 2021 జూలై 12
ఇంటర్న్‌షిప్ గడువు- 5 నుంచి 8 వారాలు
ఎంపిక విధానం- విద్యార్థుల అకడమిక్ రికార్డ్స్‌ని బట్టి ఎంపిక చేస్తారు
IIT Summer Internship: ఐఐటీలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 86
డిపార్ట్మెంట్ ఆఫ్ బయో మెడికల్ ఇంజనీరింగ్- 7
డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్- 11
డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ- 3
డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్- 4
డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 19
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 9
డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్- 3
డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్- 19
డిపార్ట్మెంట్ ఆఫ్ మెటల్లార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్- 6
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్- 5
అభ్యర్థులు ముందుగా https://www.iitrpr.ac.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో News and Announcement సెక్షన్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లింక్ ఉంటుంది.
Call of application for summer internship programme from May 17 to July 12, 2021 లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఫోటోగ్రాఫ్, ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
చివరగా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంటర్న్‌షిప్ డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. సాధారణంగా అయితే విద్యార్థులకు ఐఐటీ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవరకు అక్కడే ఉండి ఐఐటీ క్యాంపస్ జీవితాన్ని చూసే అవకాశం ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.