Home /News /jobs /

IIT ROORKEE UTTARAKHAND POLICE TO HOST CYBER HACKATHON WINNER WILL GET 6 LACKS DETAILS HERE GH VB

Cyber Crime: మీకు ప్రోగ్రామింగ్ లో మంచి ప్రావీణ్యం ఉందా..? అయితే రూ.6 లక్షలు మీవే..! వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ (Cyber Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఉత్తరాఖండ్ పోలీస్ (Uttarakhand Police) దేవభూమి సైబర్ హ్యాకథాన్ (Devbhoomi Cyber Hackathon) అనే ఒక ఈవెంట్‌ను గతంలో నిర్వహించారు. ఈ కాంపిటేషన్‌ను మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ (Cyber Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఉత్తరాఖండ్ పోలీస్ (Uttarakhand Police) దేవభూమి సైబర్ హ్యాకథాన్ (Devbhoomi Cyber Hackathon) అనే ఒక ఈవెంట్‌ను గతంలో నిర్వహించారు. సైబర్ హ్యాకథాన్ అంటే సైబర్ క్రైమ్(Cyber Crime) ముప్పును పరిష్కరించడానికి కంప్యూటర్ ప్రోగ్రామ్మింగ్స్‌ రాసే ఒక కాంపిటేషన్. ఈ కాంపిటేషన్‌ను మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ రెండో ఎడిషన్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) సహకరిస్తోంది. స్మార్ట్ పోలీసింగ్ యుగంలో ఒక బెంచ్‌మార్క్‌ని సెట్ చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీస్‌లతో కలిసి దేవభూమి సైబర్ హ్యాకథాన్ 2.0 ఎడిషన్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది.

ఉత్తరాఖండ్ పోలీసులు తాజాగా డెహ్రాడూన్‌లోని ప్రధాన కార్యాలయంలో దేవభూమి సైబర్ హ్యాకథాన్ అనే మెగా ఈవెంట్ వెబ్‌సైట్‌ను (https://iitr.ac.in/dch/) ప్రారంభించారు. ఈ మెగా ఈవెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి ఆగస్టు 12న రూ.6 లక్షల నగదు బహుమతులు పంపిణీ చేయనున్నారు. ఈవెంట్‌లో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, స్టూడెంట్స్ పాల్గొనవచ్చు. https://iitr.ac.in/dch/ లింకు ద్వారా రిజిస్ట్రేషన్ డేట్ వంటి ముఖ్య వివరాలు తెలుసుకోవచ్చు.

మూడు దశల్లో హ్యాకథాన్‌
దేవభూమి సైబర్ హ్యాకథాన్ మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ ప్రిలిమ్స్‌లో వెబ్‌సైట్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పరిష్కారాలు, ఆలోచనలు సబ్మిట్ చెయ్యొచ్చు. దీని తర్వాత మెయిన్స్, బహుమతి పంపిణీ ఈవెంట్స్ ఉంటాయి. ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “గౌరవనీయులైన ప్రధాన మంత్రి స్మార్ట్ పోలీసింగ్ విజన్‌ను అనుసరించి దేవభూమి సైబర్ హ్యాకథాన్ మొదటి ఎడిషన్‌ను గతేడాది ఉత్తరాఖండ్ పోలీసులు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 332 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ సంవత్సరం, ఐఐటీ రూర్కీ నాలెడ్జ్ పార్టనర్‌గా, టెక్ మహీంద్రా పారిశ్రామిక భాగస్వామిగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌ను రెండో సారి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం." అని పేర్కొన్నారు.
"గత ఒకట్రెండు ఏళ్లలో ఉత్తరాఖండ్ సైబర్ పోలీసులు చక్కగా పని చేసారు. స్మార్ట్ పోలీసింగ్‌ను రూపొందించే వినూత్న టెక్నాలజికల్‌ సొల్యూషన్స్ కనుగొనడానికి సిద్ధంగా ఉన్నాయి.

GK Capsule: ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభ్యర్థులకు.. ఈ కరెంట్ అఫైర్స్ మీ కోసమే..


ఈ సంవత్సరం విద్యార్థులతో పాటు పరిశ్రమల నిపుణులు పాల్గొనవచ్చు. ఈ ఈవెంట్‌లో పాల్గొనే వారందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని డీజీపీ అశోక్ కుమార్ అన్నారు. టెక్నాలజికల్‌ సొల్యూషన్స్ తీసుకురావడం కోసం హ్యాకథాన్ ఆవశ్యకత గురించి భారత ప్రధాన మంత్రి మోదీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. “ఉత్తరాఖండ్ పోలీసులు అత్యంత ఉత్సాహంతో, స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిబద్ధతతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమి సైబర్ హ్యాకథాన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఇలాంటి హ్యాకథాన్‌ను ఉత్తర భారతదేశంలో నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది” అని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ఐఐటీ రూర్కీ ఉత్తరాఖండ్ పోలీసుల ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఉత్తరాఖండ్ డీజీపీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ మెగా ఈవెంట్‌లో రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు, MHA అధికారులు, ఐఐటీ రూర్కీ అండ్ మహీంద్రా బృందం డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె. చతుర్వేది పాల్గొన్నారు. ఐఐటీ రూర్కీకి చెందిన ప్రొఫెసర్ పీ.సతీష్ కుమార్ పెద్దోజు, ప్రొఫెసర్ అక్షయ్ ద్వివేది ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలు గా ఉన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IIT, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు