IIT ROORKEE SPECIAL ONLINE COURSE ON SANSKRIT LANGUAGE ELIGIBILITY TO APPLY GH VB
IIT Roorkee: సంస్కృత భాషపై ఐఐటీ రూర్కీ స్పెషల్ ఆన్లైన్ కోర్సు.. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఇవే..!
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) రూర్కీకి చెందిన సంస్కృత క్లబ్, సంస్కృతంపై సరికొత్త ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కోసం ‘సంస్కృత భారతి’ (Samskrita Bharati) సహకారం అందించనుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) రూర్కీకి చెందిన సంస్కృత క్లబ్, సంస్కృతంపై సరికొత్త ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కోసం ‘సంస్కృత భారతి’ (Samskrita Bharati) సహకారం అందించనుంది. భగవద్గీత మాధ్యమం ద్వారా సరళమైన సంభాషణ సంస్కృతాన్ని బోధించడమే ఈ కోర్సు లక్ష్యమని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ఈ కోర్సులో పాల్గొనాలనుకునే అభ్యర్థులు IIT రూర్కీ సంస్కృత క్లబ్ (IIT Roorkee Sanskrit Club) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 20. ఈ కోర్సుకు ‘‘భగవద్గీత ద్వారా సంస్కృతం నేర్చుకోవడం’’ (Learning Samskritam through Geeta) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మూడు నెలల పాటు జరిగే ఈ కోర్సులో వారానికి రెండు లెక్చర్స్, ఒక ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. మే 23 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
అర్హత ప్రమాణాలుఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిదలో సుభాషితం సంస్కృతం లెవల్-5, లేదా దానికి సమానమైన కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇతర సమానమైన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సంస్కృతంలో మాట్లాడే పరిజ్ఞానం ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు గీతాసోపానం పుస్తకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కోర్సుకు రిపరెన్స్గా ఉపయోగపడుతుంది.
దరఖాస్తు విధానం
స్టెప్-1: ఐఐటీ రూర్కీ సంస్కృత క్లబ్ అధికారిక వెబ్సైట్ https://www.iitr.ac.in/sanskritclub/index.html ను సందర్శించి సైన్ అప్ చేయండి.
స్టెప్-2: క్రియేట్ చేసిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
స్టెప్-3: ప్రాథమిక వివరాలను పూరించి కోర్సు వివరాలను పరిశీలించండి. ఈ తరువాత మీ వివరాలను ఎంటర్ చేయండి
స్టెప్-4: భవిష్యత్తు అవసరాల కోసం రిజిస్ట్రేషన్ ఫారంను సేవ్ చేయండి
ఈ కోర్సులో పాల్గొనేవారికి సంస్కృతం ద్వారా భగవద్గీతను పరిచయం చేయనునున్నారు. అలాగే గీతలోని 12వ అధ్యాయం వివరంగా బోధించనున్నారు. సంఖ్యలు, అవ్యయాలు, ఉపసర్గలు, ప్రత్యయాల సహాయంతో స్పోకెన్ సంస్కృతంపై రివిజన్ ఉండనుంది. ఏడు విభక్తుల్లో అజంతా హలంట్ సర్వనామం పదాలను ఉపయోగించడం, నేర్చుకోవడం, అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అలాగే ఐదు లకారాలలో పరస్మైపద, ఆత్మనేపద ధాతువులను ఉపయోగించి సంస్కృత అభ్యాసాలను బోధించనున్నారు.ఈ కోర్సును మొత్తం 29 ప్రధాన ఉపన్యాసాలుగా విభజించారు. Webex ద్వారా ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఒక్కొ ఉపన్యాసానికి ఒకటిన్నర గంట వ్యవధి ఉంటుంది. వారానికి రెండుసార్లు సాయంత్రం 6:30 గంటలకు (IST) కు ప్రారంభమవుతుంది.
సాధారణంగా ఐఐటీలు సాంకేతికతకు సంబంధించిన అంశాలపై ఆన్ లైన్ కోర్సులు లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఇటీవల వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం -2020 ప్రకారం ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ రూర్కీ సంస్కృత భాషపై ఆన్లైన్ కోర్సు ప్రారంభించడం గమనార్హం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.