హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Roorkee: ఐఐటీ రూర్కీ నుంచి స్పార్క్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్..అర్హత,స్టైఫండ్ వివరాలు..

IIT Roorkee: ఐఐటీ రూర్కీ నుంచి స్పార్క్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్..అర్హత,స్టైఫండ్ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ రూర్కీ తాజాగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ 175వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని SPARK ప్రోగ్రామ్ కింద 25 యూజీ, 10 పీజీ ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

IIT Roorkee: మెరిట్ విద్యార్థుల కోసం వివిధ సంస్థలు ఇంటర్న్‌షిప్స్‌కు(Internships) అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో కెరీర్‌‌కు అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు స్టైఫండ్ ద్వారా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నాయి. దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటైన ఐఐటీ రూర్కీ(IIT -Roorkee) కూడా తాజాగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ 175వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని SPARK ప్రోగ్రామ్ కింద 25 యూజీ, 10 పీజీ ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తోంది. IIT రూర్కీ నుంచి 200 కి.మీ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఇతర సంస్థలకు చెందిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

* ఇంటర్న్‌షిప్ వివరాలు

దేశంలోని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్ నుంచి సంబంధిత విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో (BArch/BE/BTech), పోస్ట్ గ్రాడ్యుయేట్‌(MSc/MA)లో కనీసం రెండు సెమిస్టర్‌లను పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నుంచి 8 వారాలు ఉంటుంది. యూజీ ఇంటర్న్‌షిప్‌కు గరిష్టంగా 6 వారాలు కాగా, పీజీ ప్రోగ్రామ్ గరిష్టంగా 6 నెలలుగా ఉంటుంది. స్టైఫండ్ వారానికి రూ.2500గా నిర్ణయించారు.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు ఐఐటీ రూర్కీ అధికారిక పోర్టల్‌ను విజిట్ చేసి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ప్రస్తుత డిగ్రీ చివరి సెమిస్టర్ మార్క్‌షీట్, ఫోటోగ్రాఫ్, 500 వర్డ్స్ రీసెర్చ్ స్టేట్‌మెంట్, రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు ఫ్యాకల్టీ సభ్యుల జాబితా నుంచి తమకు నచ్చిన ఐదుగురు ఫ్యాకల్టీ సభ్యుల పేర్లను అప్లికేషన్‌లో పేర్కొనాలి. ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ను సమర్పించాల్సి ఉంటుంది.

IGNOU: ఇగ్నో ఉద్యోగాలు .. JAT రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

* కనీస CGPA ప్రమాణాలు

ఐఐటీలు, ఐఐఎస్‌సీలకు చెందిన విద్యార్థులకు సీజీపీఏ 7.5 కంటే ఎక్కువగా ఉండాలి. ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్ ఐఎస్‌ఈఆర్, ఐఐఈఎస్‌టీ, యూఎం-డీఏఈసీబీఎస్‌లకు చెందిన విద్యార్థులకు సీజీపీఏ 8 కంటే ఎక్కువగా ఉండాలి. ఇతర ఇన్‌‌స్టిట్యూట్‌లకు చెందిన విద్యార్థులకు 8.5 కంటే అధికంగా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు ఈ స్పార్క్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయనున్నారు. ఇంటర్న్‌షిప్ మే రెండో వారంలో ప్రారంభం కానుంది. వసతి, మెస్ సౌకర్యాల కోసం ప్రతి అభ్యర్థి నెలకు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.

* కటింగ్ -ఎడ్జ్ రీసెర్చ్ అంశాలపై వర్క్

SPARK ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులు కటింగ్ -ఎడ్జ్ రీసెర్చ్ అంశాలపై ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్యాకల్టీ మెంబర్స్‌తో కలిసి పనిచేయనున్నారు. ప్రధానంగా ఇటీవల ఏర్పాటు చేసిన మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా 26 అకడమిక్ డిపార్ట్‌మెంట్స్, సెంటర్స్‌కు చెందిన ఫ్యాకల్టీ మెంబర్స్‌ ఈ పరిశోధనల్లో భాగం కానున్నారు.

First published:

Tags: Career and Courses, Internship, JOBS