ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ, స్ట్రాటజిక్ డిసిజన్ మేకింగ్ కోసం బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రొవైడర్ సింప్లిలెర్న్ ద్వారా ఈ కోర్సును ఆన్లైన్ మోడ్‌లో అందించనుంది. ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు జేఈఈ స్కోర్ తప్పనిసరి కాదు. ఐఐటీ రూర్కీ ఫ్యాకల్టీ డిజైన్ చేసిన ఈ ప్రోగ్రామ్ ను సిప్లిలెర్న్ ఆన్లైన్లో డెలివరీ చేయనుంది. అభ్యర్థులు డేటాకు సంబంధించిన నిజమైన విలువను వెలికితీయడం, డేటా ఆధారిత వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్చుకుంటారు.
బిజినెస్ అనలిస్ట్స్, మధ్య స్థాయి నుండి సీనియర్ స్థాయి మేనేజర్లు, సి-సూట్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్స్ అండ్ బిజినెస్ హెడ్స్ వంటి విస్తృత శ్రేణి పరిశ్రమల నేపథ్యం నుంచి కనీసం ఆరు సంవత్సరాల వర్క్ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్‌కు ఈ ప్రోగ్రామ్ బాగా సరిపోతుంది. దీంతో మెరుగైన, మరింత సమర్థవంతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన అనలిటిక్స్ అప్లై చేయడంపై అవగాహన పెంపొందించుకోవచ్చని ఐఐటీ రూర్కీ పేర్కొంది.
* కోర్సు పాఠ్యాంశాలు
కోర్సులో భాగంగా అభ్యర్థులు నేర్చుకునే అంశాలు ఇలా ఉన్నాయి.
1. లీనియర్ అండ్ నాన్-లీనియర్ రిగ్రెషన్
2. లాజిస్టిక్ రిగ్రెషన్
3. డేటా మైనింగ్ ఫర్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్
4. టైమ్ సిరీస్ అండ్ ఫోర్ క్యాస్టింగ్
5. టెక్స్ట్ అనలిటిక్స్
6. లీనియర్ అండ్ లాజిస్టిక్స్ రిగ్రెషన్ కేస్ స్టడీ
7. బైనరీ ప్రోగ్రామింగ్
8. R / ఎక్సెల్ సెషన్ ఫర్ బీఐపీ అండ్ ఐపీ
9. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ మోడల్స్
10. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాక్టీస్ సెషన్
11. నాన్-లీనియర్ ప్రోగ్రామింగ్
12. నాన్-లీనియర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్
13. మల్టీ-ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్
14. గోల్ ప్రోగ్రామింగ్
15. హ్యూరిస్టిక్స్
16. మెటా-హ్యూరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్
ఈ కోర్సు గురించి సింప్లిలెర్న్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ నారాయణన్ మాట్లాడుతూ.. “నేటి డిజిటల్ యుగంలో ప్రతి సంస్థ తమ నిర్ణయాలను మరింత కచ్చితత్వంతో డేటా ఆధారితంగా తీసుకోవాలని చూస్తోంది. అవసరమైనప్పుడు రియల్-టైమ్ రెస్పాన్స్ అందించడానికి, ఆటోమేటిక్‌గా నిర్ణయాలు తీసుకోవడానికి సంస్థలు అనలిటిక్స్ (Analytics)ను వినియోగిస్తున్నాయి. డేటా ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడం ద్వారా సంస్థలు తమ రిస్క్‌ను తగ్గించుకోవడానికి బిజినెస్ అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతాయి.’ అని చెప్పారు.
ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె.చతుర్వేది మాట్లాడుతూ.. “డేటా ఆధారిత పద్ధతులు- సాంకేతికతలు.. ఇంజనీరింగ్ వరల్డ్, టెక్నాలజీ, వాణిజ్యం, సమాజాన్ని విస్తృతంగా మారుస్తున్నాయి. ఐఐటీ రూర్కీ అండ్ సింప్లిలెర్న్ల మధ్య సహకారం అభ్యర్థులకు అవగాహన కల్పిస్తుందని తద్వారా సంస్థలకు సాధికారతనిస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం.’ అని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Career and Courses, IIT, JOBS