హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Roorkee: ఐఐటీ రూర్కీ నుంచి సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్.. ప్రత్యేకతలివే

IIT Roorkee: ఐఐటీ రూర్కీ నుంచి సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్.. ప్రత్యేకతలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ రూర్కీ (IIT Roorkee) సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌‌ను ఆఫర్ చేస్తోంది. ఇందుకు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఇమార్టికస్ లెర్నింగ్ సహకారం అందించనుంది. 

  • Trending Desk
  • Last Updated :
  • Roorkee, India

ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు సరిపోయే టెక్నికల్ కోర్సులకు (Technical Courses) ఎంతో డిమాండ్ ఉంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ (Cyber Security) ఒకటి. ఫిషింగ్, మాల్వేర్, మనీ లాండరింగ్ వంటి సైబర్ నేరాల (Cyber Crimes) సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌‌ను ఆఫర్ చేస్తోంది. ఇందుకు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఇమార్టికస్ లెర్నింగ్ సహకారం అందించనుంది.

ఆరు నెలల ప్రోగ్రామ్..

ఐఐటీ రూర్కీ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ఇది నాలుగో బ్యాచ్‌. ఆరు నెలల పాటు కొనసాగనున్న ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్.. ఎతికల్ హ్యాకింగ్ నుంచి ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ వరకు మల్టిపుల్ సైబర్ సెక్యూరిటీ ప్రాసెసెస్‌, టూల్ రేజింగ్‌ను కవర్ చేయనుంది.

Digital University: డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏంటి? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి..? యూజీసీ చైర్మన్ వివరణ..

ఆన్‌లైన్ క్లాసులు

ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ వంటి వాటిపై ఈ కోర్సు ద్వారా లెర్నర్స్‌‌కు అవగాహన కల్పించన్నారు. కోర్సులో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, ఐఐటీ రూర్కీ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ సెషన్స్ నిర్వహించనున్నారు. సర్టిఫికేషన్ కోర్సు ఆన్‌లైన్ క్లాసులు అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ బేస్డ్ కోర్సులు సైతం సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్, టూల్స్ ద్వారా సైబర్ సెక్యూరిటీ స్పేస్‌లోని లెటెస్ట్ డెవలప్‌మెంట్స్‌పై అవగాహన కల్పించనున్నాయి.

లైవ్ సెషన్స్..

ఈ కోర్సును పూర్తిచేసిన వారు, EC-కౌన్సిల్‌కు చెందిన సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CompTIA సెక్యూరిటీ+ వంటి మల్టిపుల్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. లైవ్ ఇన్‌స్ట్రక్టర్-లెడ్ సెషన్స్, మెంటర్స్‌తో ఆన్‌లైన్ డిస్కషన్స్, LMS అండ్ హోమ్ అసైన్‌మెంట్‌లపై డౌట్ క్లారిఫికేషన్స్ సెషన్లు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ రంగంలో అభ్యర్థులు బలమైన కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఇమార్టికస్ లెర్నింగ్ సపోర్ట్ చేయనుంది. కోర్సు పూర్తయిన తర్వాత లెర్నర్స్.. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్స్, ఎథికల్ హ్యాకర్స్, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్స్, అప్లికేషన్ సెక్యూరిటీ అనలిస్ట్స్‌గా పని చేసే అవకాశం ఉంటుంది.

2022 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సైబర్ థ్రెట్స్ జరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సంస్థల డేటాను రక్షించగల నైపుణ్యం ఉన్న సైబర్ నిపుణులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు ఇమార్టికస్ లెర్నింగ్ వ్యవస్థాపకుడు నిఖిల్ బర్షికర్. పరిశ్రమ నిపుణుల నుంచి ఎక్స్ పీరియన్స్ పొందేందుకు, వాటిని రియల్ వరల్డ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కోర్సు ఉపయోగ పడుతుందన్నారు. అలాగే అభ్యర్థులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి, ఎలాంటి సైబర్ థ్రెట్స్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేయడంలో ఈ కోర్సు కీలకంగా మారనుందని చెప్పారు.

ఐఐటీ రూర్కీ విజిట్..

మూడు రోజుల క్యాంపస్ ఇమ్మర్షన్ మాడ్యూల్‌లో పాల్గొనడంతో పాటు ఐఐటీ రూర్కీని సందర్శించే అవకాశాన్ని కూడా అభ్యర్థులు పొందనున్నారు. ఇది వారికి విలువైన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ అవకాశాలను అందిస్తుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Cyber security, IIT, JOBS

ఉత్తమ కథలు